Polavaram Residents Compensation Problems in AP :వాళ్లు ఒకప్పుడు బాగా బతికిన వాళ్లే! మంచి ఇళ్లు! పొలాలు! ఆస్తులు. ఇలా దేనికీ లోటులేదు! కానీ గత ప్రభుత్వ పాపాలు వారికి శాపాలయ్యాయి. ఇదిగో పరిహారం, అదిగో పునరావాసం అంటూ ఆశపెట్టారు. తీరా అక్కడికెళ్తే మొండిగోడలు. పిచ్చిచెట్లు తప్ప ఏమీలేవు. అన్నీ వదులుకుని అరణ్యవాసం చేస్తున్నారు. ఆ అభాగ్యులు ఎవరోకాదు ఏపీ జీవనాడి కోసం సర్వం త్యాగం చేసిన పోలవరం నిర్వాసితులు! నాడు జగన్ మాటలు నమ్మి నిండా మునిగిన నిర్వాసితులు. నేడు కూటమి ప్రభుత్వంపైనే కొండంత ఆశలు పెట్టుకున్నారు.
నిర్వాసితుల్ని నట్టేట ముంచిన గత ప్రభుత్వం : 2021 గోదావరి వరదల సమయంలో పోలవరంప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ దేవీపట్నం మండలాన్ని ముంచెత్తాయి. ముంపు గ్రామాల ప్రజలు కట్టుబట్టలతో మైదాన ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఏడాదిలోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కూడా ఇస్తామంటూ నాటి పాలకులు, అధికారులు నమ్మబలికారు. దేవీపట్నం, పూడిపల్లిలోని గిరిజనేతరుల పునరావాసం కోసం గోకవరంలో 75 ఎకరాలు సేకరించారు. అందులో పూడిపల్లి వాసుల కోసం 20 ఎకరాల్లో చేపట్టిన ఇళ్లివి. ఇక్కడ 74 మందికి గృహాలు మంజూరు చేశారు. హామీలిచ్చినంత వేగంగా గత పాలకులు నివాసాలు పూర్తిచేయలేదు. బయట అద్దెలు కట్టుకోలేక తలుపులు, కిటికీల్లేని ఇళ్లలోనే నిర్వాసితులు తలదాచుకుంటున్నారు. కొందరైతే సొంత డబ్బుతో ఇళ్లు కట్టుకున్నారు. కానీ గత ప్రభుత్వం వారికి బిల్లులూ చెల్లించలేదు.
"రూ.2,800 కోట్లు తీసుకోండి" - పోలవరం పనులకు తొలిసారిగా అడ్వాన్స్ ఇచ్చిన కేంద్రం