PM Modi Inaugurated Vande Bharat Trains:ప్రధాని నరేంద్ర మోదీ దుర్గ్-విశాఖపట్నం వందేభారత్ ట్రైన్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. అంతే కాకుండా పలు వందే భారత్ రైళ్లకు మోదీ వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. ఇప్పటికే విశాఖ- సికింద్రాబాద్, భువనేశ్వర్- విశాఖ, సికింద్రాబాద్- విశాఖ మధ్య వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇది విశాఖ నుంచి ప్రయాణించే నాలుగవ ట్రైన్ అవుతోంది.
Visakha Vande Bharat Train Timings: దుర్గ్-విశాఖపట్నం వందే భారత్ దుర్గ్ నుంచి వారానికి 6 రోజులు (గురువారాలు మినహా) 05.45 గంటలకు బయలుదేరుతుంది. అదే రోజు 13.45 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విశాఖ-దుర్గ్ (20830) వందే భారత్ విశాఖ నుంచి వారానికి 6 రోజులు (గురువారాలు మినహా) 14.50 గంటలకు బయలుదేరుతుంది. అదే రోజు రాత్రి 22.50 గంటలకు దుర్గ్ చేరుకుంటుంది. ఈ నెల 20 నుంచి ఈ రైలు రెగ్యులర్‌గా తిరగనుంది.
విశాఖలో ప్రారంభమైన ట్రైన్: విశాఖ నుంచి రాయపూర్‌కి వెళ్లే వందే భారత్ రైల్‌ను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. ఈ నెల 20 నుంచి రెగ్యులర్ సర్వీస్ తిరుగుతుందని అన్నారు. ఈ సర్వీస్‌ను పార్వతీపురంలో నిలిపేందుకు కృషి చేశామని తెలిపారు. రైల్వే ద్వారా దేశంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి అన్నారు.