Pinnelli Ramakrishna Reddys Brother Pinnelli Venkatrami Reddy is Absconding :పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి తమిళనాడులో సేద తీరుతున్నట్లు తెలుస్తోంది. ఈవీఎం ధ్వసం కేసులో ముందస్తు బెయిల్‌తో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతం వీడి నరసరావుపేటకు చేరుకున్న రోజు వ్యవధిలోనే తన తమ్ముడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి పరారీలో ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. తనపై 307 సెక్షన్ కింద కేసు ఉన్నా అతడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించకపోవటం విమర్శలకు దారితీస్తోంది.
తమిళనాడులో పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి? - 307 సెక్షన్ కేసు ఉన్నా అరెస్టుకు ప్రయత్నించని పోలీసులు - Pinnelli Brother Absconding - PINNELLI BROTHER ABSCONDING
Pinnelli Ramakrishna Reddys Brother Pinnelli Venkatrami Reddy is Absconding : పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి తమిళనాడులో సేద తీరుతున్నట్లు తెలుస్తోంది. తనపై 307 సెక్షన్ కింద కేసు ఉన్నా అతడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించకపోవటం విమర్శలకు దారితీస్తోంది.
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 31, 2024, 9:27 AM IST
ఓట్ల లెక్కింపు రోజు మరోసారి మాచర్లలో దాడులు, అల్లర్లకు వెంకట్రామిరెడ్డి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అన్నదమ్ములిద్దరూ ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా కలిసే చేస్తారని, దాడుల విషయంలో అన్నకంటే తమ్ముడే రెండు ఆకులు ఎక్కువ చదివాడని స్థానికులు చెబుతున్నారు. పాల్వాయిగేటులో ఈవీఎం ధ్వసం, కారంపూడిలో విధ్వంసం, సీఐపై హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈనెల 16 న అరెస్ట్ చేస్తారని తెలిసి హైదరాబాద్ పరారయ్యాడు. అక్కడి నుంచి తమిళనాడు వెళ్లిపోయారు. ముందస్తు బెయిల్ పొందాక ఈ నెల 28న చెన్నై విమానాశ్రయం నుంచి గన్నవరం చేరుకుని అక్కడి నుంచి కారులో నరసరావుపేటకు చేరుకున్నారు. దీంతో పిన్నెల్లి తమ్ముడు కూడా తమిళనాడు వెళ్లి ఉంటారని సమాచారం. వెంకట్రామిరెడ్డితో పాటు పిన్నెల్లి ప్రధాన అనుచరుడు తురకా కిశోర్ కూడా పరారీలోనే ఉన్నారు. తను కూడా వెంకట్రామిరెడ్డితో పాటే ఉన్నట్లు తెలుస్తోంది.
'పిన్నెల్లి పైశాచికం' పేరుతో పుస్తకం విడుదల చేసిన టీడీపీ - TDP Released Book
అదిగో పిన్నెల్లి- కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన కాసేపట్లోనే ప్రత్యక్షం - PINNELLI IN PALNADU