Peoples Died in Road Accidents in AP :రాష్ట్రంలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరుగుతునే ఉన్నాయి. కొందరి నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల అమాయకపు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని అమరావతి - అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ మినీ లారీ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. మృతుడు గిద్దలూరుకు చెందిన దూదేకుల ఖాదర్వలీగా పోలీసులు గుర్తించారు. మొదట తీవ్రంగా గాయపడ్డ దూదేకుల ఖాదర్‌వలిని కుటుంబ సభ్యులు గిద్దలూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆ వ్యక్తి మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని గిద్దలూరు అర్బన్ సీఐ సోమయ్య వెల్లడించారు.
ఆగి ఉన్న లారీని ఢీకొన్న మరో వాహనం - ముగ్గురు మృతి - శబరిమల వెళ్తున్న బస్సు ఢీకొని ఒకరు
Road Accidents In Andhra Pradesh : బాపట్ల జిల్లా శింగరకొండ మలుపు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి వెళ్తున్న కారు శింగరకొండ మలుపు వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. సమచారం అందుకున్న పోలీసులు ఘటనికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు కావలి మండలం జలదంకి గ్రామానికి శ్రావణ్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. అనంతరం శ్రావణ్ మృతి గురించి వారి బంధువులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని అద్దంకి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.