ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎండిన నీటికుంట - నిండుకున్న నీళ్లు - పట్టించుకోని సర్కార్​ - Drinking water problem

People Facing Problems Due to Lack of Drinking Water: దేశంలో ఎక్కడా లేని విధంగా తాగునీటిని కుంటలోని నీటితో గొంతులు తడుపుకుంటున్న ఊరు ఏదైనా ఉంది అంటే అది కర్నూలు జిల్లాలోని రామచంద్రాపురం (కొత్తూరు)ను ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ గ్రామంలో దశాబ్దాల కాలంగా గ్రామస్థులు తమ దాహాన్ని నీటికుంట ద్వారా తీర్చుకుంటున్నారు.

water_problem
water_problem

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 31, 2024, 9:32 AM IST

ఎండిన నీటికుంట - నిండుకున్న నీళ్లు - పట్టించుకోని సర్కార్​

People Facing Problems Due to Lack of Drinking Water:రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందినా ఇప్పటికీ కొన్ని గ్రామాలు తాగునీటికి నీటికుంటలపైనే ఆధారపడాల్సి వస్తోంది. రక్షిత మంచినీటి మాట దేవుడెరుగు అసలు నీరు అనేది ఉంటే చాలు దేవుడా అంటున్నారు దశాబ్దాలుగా తమ గొంతులను తడిపిన ఆ నీటికుంట సైతం ఎండిపోవడంతో ఆదుకోవాలంటూ వారంతా ఖాళీ బిందెలతో శుక్రవారం సీఎం జగన్ బస్సును అడ్డగించారు. ముఖ్యమంత్రి నుంచీ తమకు ఎలాంటి బలమైన హామీ లభించలేదని మహిళలు వాపోతున్నారు.

వేసవి ప్రారంభంలోనే తాగునీటి సమస్య - పట్టించుకోని మున్సిపల్​ అధికారులు

కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ప్యాలకుర్తి మజరా రామచంద్రపురం కొత్తూరు వాసుల దాహాం తీరుస్తోంది ఆ గ్రామంలోని నీటికుంట. కోట్లు ఖర్చుచేసి రక్షిత మంచినీటి ట్యాంకులు, మినీట్యాంకులు, కుళాయిలు ఏర్పాటు చేసినా ఏనాడూ వాటిల్లో చుక్కనీరు రాలేదు. ఈ కుంటలో నీటినే మినీట్యాంకులకు అధికారులు పంపింగ్‌ చేయగా వాటినే అరకొరగా గ్రామస్థులు వాడుకునేవారు. ఊరిలో ఎక్కడ బోరు వేసినా ఫ్లోరైడ్ నీరు వస్తుండటంతో ఈ కుంట నీటినే జాగ్రత్తగా వాడుకునేవారు. అయితే ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులకు తోడు నీటి కుంట నిర్వహణను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పూర్తిగా ఎండిపోయింది.

ఎండిపోతున్న సరస్సుల్లోకి నీరు విడుదల- బెంగళూరు నీటి కొరత తీర్చేందుకు అధికారుల పాట్లు

మూడు నెలలుగా తాగునీటికి గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోడుమూరు, కె.నాగలాపురం నుంచి ట్యాంకర్ల ద్వారా వస్తున్న నీటిని బిందెకు 20 రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. తాగునీటి సమస్య పరిష్కరించాలని నేతలకు ఎన్నోసార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. జలజీవన్‌ మిషన్‌ కింద ఈ గ్రామానికి 72 లక్షలు మంజూరైనా పైసా ఖర్చు చేయలేదు. కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన వాటర్‌ ట్యాంకులు అలంకారప్రాయంగా మారాయి. వాటిల్లో ఫ్లోరైడ్ నీటినే సరఫరా చేస్తున్నారని గ్రామస్థులు మండిపడుతున్నారు.

శ్రీ సత్య సాయి జిల్లాలో ఉగ్రరూపం దాల్చుతున్న తాగునీటి సమస్య- జాతీయ రహదారిపై బైఠాయించిన మహిళలు

సీఎం జగన్​ను నిలదీత:కుంట నీరే తాగుతూ జీవనం గడుపుతున్న తమ దుర్భర పరిస్థితిని ప్రజాప్రతినీధులు కాని, అధికారులు కాని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామం గుండా బస్సు యాత్ర చేపట్టిన సీఎం జగన్మోహన్ రెడ్డిని ఖాళీ బిందెలతో గ్రామస్థులు రోడ్డెక్కి నిలదీశారు. తమ గ్రామంలో తాగునీటి సమస్య తీర్చాలని అడగగా ఇప్పుడు ఏమి చేయలేనని ఓట్లు వేసి గెలిపిస్తే సమస్య పరిష్కారిస్తారని సీఎం చెప్పడం ఆందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అలంకారప్రాయంగా నాలుగు లక్షల లీటర్ల సామర్థ్యం గల ఓహెచ్ఆర్ ట్యాంకు ఉన్నా గ్రామానికి చుక్క నీటిని సరఫరా చేయడం లేదని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరుతో ఉన్న పథకానికి వైయస్సార్ సుజల స్రవంతి అని పేరు మార్చారు కానీ తమకు తాగడానికి నీళ్లు అందించలేకపోయారని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details