ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాళం వేసిన ఇంటికి రూ.183 బిల్లు - హడలిపోతున్న వినియోగదారులు - ELECTRICITY CHARGES HIKE AVANIGADDA

కనెక్షన్ వద్దన్న వినియోగదారుడు - రూ.2,640 కడితే తీస్తామన్న విద్యుత్​ శాఖ

Electricity Charges Hike in Andhra Pradesh
Electricity Charges Hike in Andhra Pradesh (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 11, 2025, 12:44 PM IST

Electricity Charges Hike in Andhra Pradesh:కరెంటు బిల్లులు కట్టాలంటే సామాన్య ప్రజలు హడలిపోతున్నారు. నెలసరి బిల్లు వచ్చిందంటే చాలు దాన్ని ఎలా కట్టాలా? అని ఆందోళన చెందుతున్నారు. ఒక వ్యక్తికి రూ.852 బిల్లు వచ్చింది. దానిలో ట్రూఅప్, ఈపీపీసీఏ ఇతర ఛార్జీలు మొత్తం కలిపి రూ.388 ఉన్నాయంటే విద్యుత్​ శాఖ వినియోగదారులను ఏ విధంగా బాదుతుందో అర్ధం చేసుకోవచ్చు. అంటే మొత్తం బిల్లులో 45 శాతం పాతబిల్లుల బాపతు వసూలు చేస్తున్నారు.

బిల్లులో సగానికి పైగా ఇతర ఛార్జీలు (ETV Bharat)

అవనిగడ్డలో సైతం:అవనిగడ్డలో తాళం వేసి ఉన్న ఓ గృహానికి గతంలో రూ.100లోపు బిల్లు వచ్చేది. ఈ బాదుడు మొదలు పెట్టడంతో ప్రస్తుతం నెలకు రూ.150 నుంచి 183 వరకు బిల్లు వస్తోంది. దీంతో విద్యుత్​ కనెక్షన్‌ వద్దని ఆ ఇంటికి సంబంధించిన వారు విద్యుత్​ శాఖ అధికారులను సంప్రదించారు. కనెక్షన్‌ వదులుకోవాలంటే రూ.2,640 కడితే సరఫరా రద్దు చేస్తామన్నారట. ఇంకా 9 నెలలకు సంబంధించిన బకాయిలు కడితే అప్పుడు సర్వీసు తీసేస్తామని అధికారులు చెప్పారని వారు వాపోతున్నారు. దీంతో ఇప్పుడు వస్తున్న దానికంటే మిగిలిన 9 నెలలకు ఇంకా ఎక్కువ బిల్లు వస్తుందేమోనని వారు హడలిపోతున్నారు.

ABOUT THE AUTHOR

...view details