People Are Facing Problems in CM Jagan Meeting: సీఎం జగన్ ఎక్కడ కాలు పెడితే అక్కడ ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. అనకాపల్లిలో సీఎం జగన్మోహన్ రెడ్డి సభ జరగనున్న నేపథ్యంలో జనాన్ని తరలించేందుకు ఆర్టీసీ బస్సులను పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. జనాన్ని తరలించేందుకు అనకాపల్లి జిల్లా నుంచి 45 ఆర్టీసీ బస్సులతోపాటు వివిధ జిల్లాల నుంచి మరో 250 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. బస్టాండ్‌లో బస్సులు లేక ప్రయాణికులు నానా పాట్లు పడుతున్నారు.
నేడు విశాఖలో పారిశ్రామికవేత్తలతో సీఎం జగన్ సమావేశం
Traffic Problems With CM Jagan Meeting:బస్సుల కోసం విద్యార్థులు, చిన్న పిల్లలతో మహిళలు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. పిసినికాడలో ఏర్పాటు చేసిన సీఎం బహిరంగ సభకు సంబంధించి కాన్వాయ్ ట్రైల్ రన్ చేయడంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్‌లో ఇంటర్ పరీక్ష రాయడానికి వెళ్లే విద్యార్థులు ఇరుక్కున్నారు. సమస్యను పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి పర్యటనను పురస్కరించుకొని కశింకోట మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో హెలిప్యాడ్ను అధికారులు సిద్ధం చేశారు. ఈ క్రమంలో భారీ వృక్షాలను సైతం నరికేసి మోడుగా మార్చేశారు. బాల సదనంలో ఉన్న భారీ వృక్షంతో పాటు మండల పరిషత్, తహసీల్దార్, వ్యవసాయ కార్యాలయాలకు వచ్చే ప్రజలంతా సేదతీరే చెట్టు కొమ్మలను సైతం నరికేశారు.