ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉప ముఖ్యమంత్రిగా పవన్‌ కల్యాణ్ బాధ్యతలు - పలు దస్త్రాలపై సంతకాలు - Pawan Kalyan Charge as Deputy CM - PAWAN KALYAN CHARGE AS DEPUTY CM

Pawan Kalyan Took Charge as Deputy Chief Minister : ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ విజయవాడ క్యాంపు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అలాగే పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్‌, పర్యావరణ, శాస్త్రసాంకేతిక, అటవీ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. పలు దస్త్రాలపై ఆయన సంతకాలు చేశారు.

Pawan Kalyan Took Charge as Deputy Chief Minister:
Pawan Kalyan Took Charge as Deputy Chief Minister: (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 19, 2024, 11:21 AM IST

Updated : Jun 19, 2024, 3:49 PM IST

Pawan Kalyan Took Charge as Deputy Chief Minister : ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ విజయవాడ క్యాంపు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఛాంబర్‌లో పూజలు నిర్వహించిన అనంతరం దస్త్రాలపై సంతకాలు చేశారు. అలాగే పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్‌, పర్యావరణ, శాస్త్రసాంకేతిక, అటవీ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఉపాధి హామీ పథకానికి ఉద్యానవన పనులను అనుసంధానించే నిధుల మంజూరు దస్త్రంపై, గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణ దస్త్రంపై సంతకాలు చేశారు. అలాగే పలు దస్త్రాలపై ఆయన సంతకాలు చేశారు. అనంతరం సోదరుడు నాగబాబు, వివిధ శాఖల అధికారులు, ఎమ్మెల్యేలు, నేతలు పవన్‌కు అభినందనలు తెలిపారు.

సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు - తొలిరోజే ఆ ఐదు సంతకాలు పూర్తి - CM Chandrababu Naidu

పవన్‌ కల్యాణ్‌కు అభినందనలు :డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్‌ కల్యాణ్‌కు మంత్రులు, జనసేన నేతలు అభినందనలు తెలిపారు. ఆయన్ను కలిసిన వారిలో మంత్రులు నాదెండ్ల మనోహర్‌, కందుల దుర్గేశ్‌, ఎంపీ తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ యాదవ్‌, టీడీపీ నేత, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తదితరులు ఉన్నారు.

పారిశ్రమలకు తొలి ప్రాధాన్యత- కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసవర్మ - Bhupathiraju Srinivasa Varma Charge

కేంద్రమంత్రులుగా రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ బాధ్యతలు - రాష్ట్రానికి శుభవార్త - Rammohan Naidu charge as Minister

Last Updated : Jun 19, 2024, 3:49 PM IST

ABOUT THE AUTHOR

...view details