ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పల్నాడు జిల్లాలో 9 మంది అరెస్ట్ - 25 లక్షల విలువైన సొత్తు స్వాధీనం - THEFT CASES IN PALNADU DISTRICT

170 గ్రాముల బంగారం, 4 కిలోల వెండి, రూ. 10వేల నగదు స్వాధీనం

Theft Cases in Palnadu District
Theft Cases in Palnadu District (Etv Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 23, 2024, 1:02 PM IST

Theft Cases in Palnadu District : దొంగతనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఏ వస్తువు అయితే నాకేంటి నాపనేదో నేను చేసేస్తే పోలా అనుకుంటున్నారు. ఇక ఇళ్లు, కార్యాలయాలకు తాళం కనిపించిదంటే చాలు చేతికి పని దొరికిందని సంబరపడుతున్నారు. వాటిని లూఠీ చేసే వరకు మనశ్శాంతి లభించదనుకుంటూ చోరీలకు పాల్పడుతున్నారు. రద్దీ ప్రదేశాలు, జన సముహా ప్రాంతాల్లో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కేటుగాళ్లు తమ చేతివాటానికి పనిచెబుతున్నారు. చటుక్కున అందినకాడికి దోచుకొని అక్కడినుంచి ఉడాయిస్తున్నారు.

తాజాగా పల్నాడు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వేర్వేరు ఘటనల్లో చోరీలకు పాల్పడుతున్న 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు వెల్లడించారు. జిల్లాలోని చిలకలూరిపేట, వెల్దుర్తి, ఐనవోలు, ఈపూరు పోలీస్​ స్టేషన్ల పరిధిలో ఈ దొంగతనాలు జరిగినట్లు చెప్పారు. వీటిపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. ఈ క్రమంలోనే నిందితుల కదలికలపై నిఘా పెట్టి అరెస్ట్ చేశామని తెలియజేశారు. వారి నుంచి సుమారు 25 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ కంచి శ్రీనివాసరావు వివరించారు.

Robbery Gang Arrested in Palnadu : ఇందులో భాగంగాచిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్​ పరిధిలో షేక్ సుభాని అనే వ్యక్తిని వద్ద 170 గ్రాముల బంగారం, 4 కిలోల వెండి, రూ.10,000లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సీ కంచి శ్రీనివాసరావు వివరించారు. అయినవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలమంద, కొమ్మిరిశెట్టి రామాంజనేయుల నుంచి 8 ద్విచక్ర వాహనాలు, ఈపూరు పీఎస్​లో వెంకటేశ్వర్లు నాయక్, భూక్యా బాలాజీ నాయక్, పూడివాలస గణపతిల నుంచి రూ.4 లక్షలు విలువ చేసే ఎలక్ట్రానిక్స్ వస్తువులను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ కంచి శ్రీనివాసరావు పేర్కొన్నారు.

వెల్దుర్తి పోలీస్​స్టేషన్ పరిధిలో మట్టపల్లి హరిబాబు అలియాస్ కమ్మ కాశీ, చల్లా భవాని శంకర్, షేక్ మస్తాన్​వలీల నుంచి 10 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. నిందితులను రిమాండ్​కి తరలించినట్లు చెప్పారు. ఈ కేసులను చేధించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు, గురజాల డీఎస్పీ, తదితరులు పాల్గొన్నారు

ఇళ్లు, గుళ్లు, రైస్ మిల్లులే లక్ష్యంగా చోరీలు - భారీగా బంగారం రికవరీ చేసిన పోలీసులు - Police Arrested Thieves gang

డబ్బు కోసం అన్నదమ్ముల చోరీలు - 12 ద్విచక్ర వాహనాలు స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details