తెలంగాణ

telangana

ETV Bharat / state

కాసేపు టెన్షన్స్​ అన్నీ లైట్​ తీస్కో భయ్యా - ఈ తేడాలు కనిపెట్టండి - ఫుల్లు రిలాక్స్! - OPTICAL ILLUSION TEST

Find The Differences Between These Two Images : "లైట్​ తీస్కో భయ్యా లైట్​ తీస్కో.. కాసేపు టెన్షన్స్​ అన్నీ లైట్​ తీస్కో.." అన్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. మీరు మోస్తున్న ప్రాబ్లమ్స్, బాధ్యతలు, బరువులు ఎప్పటికీ ఉంటాయి. జీవితాంతం కొనసాగుతూనే ఉంటాయి. మనం చేయాల్సిందల్లా వాటిని మేనేజ్ చేయడమే!

Find The Differences Between These Two Images
Find The Differences Between These Two Images

By ETV Bharat Telangana Team

Published : Apr 11, 2024, 10:50 AM IST

Find The Differences Between These Two Images : "లైట్​ తీస్కో భయ్యా లైట్​ తీస్కో.. కాసేపు టెన్షన్స్​ అన్నీ లైట్​ తీస్కో.." అన్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఇది ఏ సినిమాలో లైన్​ అన్నది మీరే కనుక్కోండి. ఇక విషయానికి వస్తే.. మీరు మోస్తున్న ప్రాబ్లమ్స్, బాధ్యతలు, బరువులు ఎప్పటికీ ఉంటాయి. జీవితాంతం కొనసాగుతూనే ఉంటాయి. మనం చేయాల్సిందల్లా వాటిని మేనేజ్ చేయడమే.

ఓ తత్వవేత్త అంటాడు.. ఒక సమస్య వచ్చినప్పుడు రెండే ఆలోచనలు చేయాలట. అవి ఏమంటే.. ఆ సమస్యను సాల్వ్ చేయడం నీ చేతిలో ఉందా? లేదా? అని మాత్రమే ఆలోచించమంటాడు. "సాల్వ్ చేయడం నీ చేతిలో ఉందనుకో.. ఇక బాధపడడం ఎందుకు? నీ చేతిలోనే ఉంది కదా! పరిష్కరించుకో" అంటాడు. ఒకవేళ "సాల్వ్ చేయడం నీ చేతిలో లేదనుకో.. వదిలేసెయ్. నీ పరిధిలో లేనప్పుడు నువ్వేమీ చేయలేవు. ఇక బాధపడడం ఎందుకు?" అంటాడు. జీవితంలో దేనికీ బాధపడాల్సిన అవసరమే లేదని ఎంత సింపుల్​గా చెప్పాడో కదా!

బొమ్మే కదా అని తీసిపారేయకండి - ఈ చిత్రంలోని తేడాలు కనిపెడితే మీలో అద్భుతం జరుగుతుంది!

రిలాక్స్ అవ్వండి..

అయితే.. ఇది కొందరికి వెంటనే అర్థమవుతుంది. మరికొందరికి టైమ్ పడుతుంది. అప్పటి లోగా మీరు ఏం చేయాలంటే.. ప్రాబ్లమ్స్ మేనేజ్ చేయడం నేర్చుకోవాలి. మరి, అది ఎలా చేయాలి అంటారా? వెరీ సింపుల్.. మీకు పని ఉన్నప్పుడు పనిలో పడండి.. అప్పుడు మనసు పూర్తిగా పనిపైనే దృష్టిపెడుతుంది. కాబట్టి బాధలవైపు వెళ్లే ఛాన్స్ తక్కువ. కాస్త టైమ్ దొరికిందనుకోండి.. మనసును రిలాక్స్​ చేసే పనులు చేయండి. లేదంటే.. మైండ్​లో చొరపడడానికి బాధలు రెడీగా ఉంటాయి. వాటికి ఛాన్స్ ఇవ్వకూడదు. ఇందుకోసం.. ఇలాంటి బొమ్మల మధ్య తేడాలు కనిపెట్టడం, సుడోకు వంటి గేమ్స్ ఆడడం వంటి పనులు చేయాలి. అప్పుడు మీకు తెలియకుండానే మనసు తేలికవుతుంది.

తేడాలు కనిపెట్టండి

6 తేడాలు కనిపెట్టండి

కాబట్టి.. ఈ చిత్రంలో తేడాలు కనిపెట్టే పని స్టార్ట్ చేయండి. దీంట్లో మొత్తం 6 డిఫరెన్సెస్​ ఉన్నాయి. ఈ తేడాలను మీరు 20 సెకన్లలోనే ఐడెంటిఫై చేయాలి. దీనివల్ల మీకు రిలాక్సేషన్​ దొరకడమే కాకుండా.. మీ అబ్జర్వేషన్​ కూడా మెరుగు పడుతుంది. ఒక వేళ టైమ్​ ముగిసిపోయినా కనిపెట్టలేకపోతే.. సమాధానాల కోసం కింద చూడండి.

ఆన్సర్స్​ ఇవే..

1. నిచ్చెన

2. బంతి

3. కుక్క తోక

4. అక్వేరియంలో చేప

5. ఫొటో ఫ్రేమ్‌

6. గిన్నె

పిల్లలు చదువుపై శ్రద్ధ పెట్టడం లేదా? - పేరెంట్స్​ ఇలా చేయాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details