One Person Copying in Group 1 Exam Centre :రాష్ట్రంలో ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలు చిన్నచిన్న ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. పరీక్షను సమర్థవంతంగా నిర్వహించేందుకు పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఇంత భద్రతలో కూడా ఒంగోలు క్విస్ ఇంజినీరింగ్ కళాశాలలో కాపీ చేస్తూ శివశంకర్ అనే అభ్యర్థి పట్టుబడ్డాడు. ఇతను పోలీసులు కళ్లు కప్పి చాకచక్యంగా సెల్ ఫోన్‌ను పరీక్ష హాలులోకి తీసుకెళ్లాడు. అనంతరం సెల్ ఫోన్ చూసి పరీక్ష కాపీ కొడుతూ ఉండగా ఇన్విజిలేటర్ గమనించి అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. వెంటనే కాలేజి యాజమాన్యానికి సమాచారం ఇవ్వడంతో వారు నిందితుడిని పోలీసులకు అప్పగించారు. ఆ అభ్యర్థిని అరెస్టు చేసిన పోలీసులు మాల్ ప్రాక్టీస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని తెలిపారు.
ముగిసిన గ్రూప్-1 ప్రిలిమ్స్ - ఒంగోలులో కాపీ చేస్తూ పట్టుబడిన అభ్యర్థి ఆబ్జెక్టివ్ విధానంలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు! ఏపీపీఎస్సీ పరిశీలన
Police Security in Group 1 Exam Centers:ప్రకాశం జిల్లా ఒంగోలులోని రైజ్ ఇంజినీరింగ్ కళాశాలలో గ్రూప్-1 పరీక్షలు రాసేందుకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులు గుర్తింపు కార్డుతో హాజరయ్యారు. పలు పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. విద్యార్థులు దగ్గర ఉన్న పర్సులు, ఎలక్ట్రికల్ వస్తువులు వంటివి ఏమున్నా లోపలికి అనుమతి ఉండదని పోలీసులు స్పష్టం చేశారు. అభ్యర్థుల దగ్గర ఉన్న వస్తువులను లాకర్ రూముల్లో భద్రపరిచారు. పరీక్ష పూర్తయిన అనంతరం ఎవరి వస్తువులు వారు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఏపీలో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల
APPSC Group 1 Exam in Andhra Pradesh:గ్రూప్-1 పరీక్షలకు సంబంధించి నెల్లూరు జిల్లాలో 13 కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షకు సంబంధించి 6954 మంది అభ్యర్థులకు హాల్ టికెట్లు ఇచ్చారు. ఈ పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 301 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల పరిధిలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను 1,48,881 మంది అభ్యర్థులు రాశారు.
పరీక్ష సమయం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఒక ఎగ్జామ్, అలాగే మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు మరొక ఎగ్జామ్ జరిగింది. అయితే ఎగ్జామ్ రాసే విద్యార్థుల పక్కన తల్లిదండ్రులు కూడా వచ్చి పరీక్ష కేంద్రాల వద్ద ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరీక్ష కేంద్రానికి ఉదయం 9.45 నిమిషాల దాటిన తరువాత వచ్చిన అభ్యర్థుల్ని లోపలికి అనుమతించలేదని కొందరు అభ్యర్థులు తెలిపారు. వీరు నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి వచ్చింది.
అయితే 2018 గ్రూప్ 1మెయిన్స్ పరిక్షపై ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ స్పందిస్తూ, అప్పడు నిర్వహించిన పరీక్ష పద్ధతి ప్రకారమే జరిగిందని తెలిపారు. హైకోర్టు మెయిన్స్‌ను రద్దు చేస్తూ ఇచ్చిన ఆర్డర్ కాపీని చదివామన్న ఆయన దీనిపై అప్పీల్ చేసే అవకాశముందన్నారు. ఉద్యోగాలు చేస్తోన్న 162 ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వారికి న్యాయం జరిగేలా ప్రయత్నాలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి - రాష్ట్ర వ్యాప్తంగా 301 కేంద్రాల్లో పరీక్ష