SIX PEOPLE TRAPPED IN PENNA RIVER: పశువులను మేతకు తీసుకెళ్లిన ఆరుగురు కాపరులు నదిలో చిక్కుకున్నారు. ఒక్కసారిగా నదీ ప్రవాహం పెరగడంతో ఎటూ వెళ్లలేక పోయారు. దీంతో బిక్కుబిక్కుమంటూ ఉన్న వారిని అతికష్టం మీద కాపాడారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నెల్లూరు జిల్లా కోవూరు మండలం జమ్మిపాలెం వద్ద పెన్నా నది వరద ప్రవాహంలో చిక్కుకున్న ఆరుగురిని అధికారులు అతికష్టం మీద కాపాడి ఒడ్డుకు చేర్చారు. జమ్మిపాలెం గ్రామానికి చెందిన ఆరుగురు పశువులు మేపేందుకు పెన్నా నదిలోకి వెళ్లారు. సోమశిల జలాశయం నుంచి నీటిని విడుదల చెయ్యడంతోపాటు, ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నదిలో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగింది. ప్రవాహ ఉద్ధృతి అధికంగా ఉండటంతో నది మధ్యలో చిక్కుకున్న వారు ఎటూ వెళ్లలేక అక్కడే చిక్కుకుపోయారు.