ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎంబీబీఎస్‌ విద్యార్థులకు అలర్ట్ - రాష్ట్రంలో కన్వీనర్‌ కోటా సీట్ల జాబితా విడుదల - MBBS Seats Allotment in AP - MBBS SEATS ALLOTMENT IN AP

Allotment MBBS Convener Quota Seats : ఏపీలో ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల జాబితాను విడుదల చేశారు. మొదటి విడతలో కౌన్సిలింగ్​లో 3612 సీట్లు కేటాయించగా అందులో 3507 భర్తీ చేశారు. సీట్లు పొందిన వారు ఈనెల 19 మధ్యాహ్నం 3 గంటల్లోగా కళాశాలల్లో చేరాలని అధికారులు తెలిపారు.

MBBS Seats Allotment in AP
MBBS Seats Allotment in AP (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 16, 2024, 10:45 AM IST

MBBS Seats Allotment in AP 2024 : రాష్ట్రంలోని 35 వైద్య కళాశాలల్లో 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎంబీబీఎస్ కన్వీనర్‌ కోటా సీట్లను కేటాయించారు. ఇందుకు సంబంధించిన జాబితాను విజయవాడలోని డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఆదివారం విడుదల చేసింది. అన్ని కళాశాలల్లో కలిపి మొత్తం 3879 సీట్లు ఉన్నాయి. వీటిలో 267 సీట్లు ప్రత్యేక కేటగిరీ కోటాకు సంబంధించినవి. ఆయా విభాగాల నుంచి ప్రాధాన్యత క్రమం వచ్చాక ఈ సీట్లను కేటాయిస్తారు.

MBBS Admissionsin AP Updates :ఇవి కాకుండా మిగిలిన 3612 సీట్లను మొదటి విడతలో భాగంగా కౌన్సిలింగ్​లో ఉంచారు. వీటిలో 3507 సీట్లను భర్తీ చేస్తూ కళాశాలల వారీగా విద్యార్థులకు కేటాయిస్తూ జాబితాను విడుదల చేశారు. మిగిలిన 105 సీట్లలో 102 మైనార్టీ కేటగిరీ, 3 స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కోటాకు సంబంధించినవి ఉన్నాయి. రెండో దశ కౌన్సిలింగ్​లో భాగంగా ప్రత్యేక, మైనార్టీ, స్కౌట్స్‌ కేటగిరీకి సంబంధించిన సీట్లను భర్తీ చేయనున్నారు. మొదటి విడతలో సీట్లు పొందిన 3507మంది విద్యార్థులు ఈనెల 19 మధ్యాహ్నం 3గంటల్లోగా వారికి కేటాయించిన కళాశాలలకు వెళ్లి చేరాలని అధికారులు తెలిపారు. వారికి అక్టోబర్ 1 నుంచి ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.

Costliest MBBS Colleges In India : దేశంలోనే అత్యంత ఖరీదైన MBBS డిగ్రీ.. ఆ కాలేజీలో ఫీజు రూ.కోట్లలో!

ABOUT THE AUTHOR

...view details