NO Permission Layouts in Kadapa : కడప అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ 862 గ్రామాలు, 51 మండలాలు, 10 పట్టణ స్థానిక సంస్ధలతో మొత్తం 13,062 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. అయితే 2019 నుంచి 2024 మధ్య ఈ విస్తీర్ణంలో అథారిటీ ద్వారా అనుమతి తీసుకున్న లే అవుట్లు 25 కాగా అనధికారికంగా వెలిసినవి 1,000కి పైగా ఉన్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అధికార యంత్రాంగం వైఎస్సార్సీపీ నేతలకు సంపూర్ణంగా సహకరించడంతోనే అక్రమాలు యథేచ్ఛగా సాగాయి.
పెద్దిరెడ్డి చెరలో 236 ఎకరాలు - ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న అక్రమాలు - Peddireddy Land Grabs
కడప అర్బన్ డెవలప్‌మెంటు అథారిటీ వైఎస్సార్సీపీ డెవలప్‌మెంటు అథారిటీగా మారిందనే విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వం మారిన నేపథ్యంలో కడపలో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో ప్రత్యేక బృందాన్ని నియమించింది. దీంతో వారు 3 రోజులపాటు వివిధ ప్రాంతాల్లోని అనధికార లే అవుట్లను బృందం పరిశీలిస్తుంది.
కడప నగరపాలక సంస్థ పరిధిలోని వినాయక నగర్ కూడలి సమీపంలో మినిస్టర్స్ కాలనీ పేరుతో ఓ వైఎస్సార్సీపీ కీలక నేత భారీ లేఅవుట్ వేయగా విల్లాల నిర్మాణం కూడా చేపట్టారు. మాచుపల్లి రోడ్డులో ఆయన సమీప బంధువులు భారీ స్థాయిలో వేసిన అక్రమ లేఅవుట్ల ప్రారంభోత్సవానికి వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు ముఖ్య అతిధులుగా హాజరవ్వడం గమనార్హం. సాయిపేట శివార్లలోనూ భారీ వెంచర్ ఏర్పాటు చేశారు. కడప నగరంలోని ఇర్కాన్ కూడలి నుంచి రింగురోడ్డు మీదుగా రాయచోటి కూడలి వరకు దాదాపు 20 అక్రమ లేఅవుట్లు వెలిశాయి.