Niranjan Reddy Fires On Congress Congress Govt : గత ప్రభుత్వాన్ని దోషిగా చూపాలన్న ప్రయత్నంలో రైతులకు ఎందుకు అన్యాయం చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వం(Government) నీళ్లు, విద్యుత్ ఇవ్వక లక్షలాది ఎకరాల్లో పంటలు(Crops) ఎండిపోతున్నాయని వడగళ్ల వానతో వేలాది ఎకరాలు పంటనష్టం జరిగిందని అన్నారు.
రైతుబంధు ఇవ్వకపోగా అడిగితే దూషిస్తున్నారన్న మాజీ మంత్రి విమర్శించారు. నీళ్లు, విద్యుత్ ఇవ్వడానికి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లోనేవ్యవసాయాన్ని(Agriculture) అతలాకుతలం చేసిందని ఆక్షేపించారు. విద్వేషం, కేసీఆర్ను తిట్టడం తప్ప పాలనపై దృష్టి లేదని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీళ్లు ఇవ్వడం చేత కాదు కానీ, నేతలను చేర్చుకునేందుకు గేట్లు ఎత్తుతారట అని ఎద్దేవా చేశారు. రాజకీయం తప్ప రైతులకు నీళ్లు ఇవ్వాలన్న తపన లేదని ఆరోపించారు. రైతులు నీళ్లు, కరెంట్ అడిగితే వారిపై కేసులు పెడుతున్నారన్నారని ఆరోపించారు.
Niranjan Reddy On Crop Damage :పంటకు నీళ్లు అందించలేక పశువులకు మేతగా పెడుతున్నారు, కళ్ల ముందే పంటలు పోతుంటే రైతులకు ఎంత బాధ ఉంటుందో తెలుసా? అని ప్రశ్నించారు. కేసీఆర్ హాయాంలో నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.10వేలు పరిహారం ఇచ్చినట్లు గుర్తు చేశారు. పదివేలు భిక్షం ఇస్తారా అని నాడు ఆడిగిన కాంగ్రెస్(Congress) నేతలు ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వడగళ్ల వాన కారణంగా నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.10వేల పరిహారం ఇవ్వాలని, ప్రభుత్వ నిర్వాకం కారణంగా ఎండిన పంటలకు కూడా ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.