NIA Searches in Chintur at Alluri District:మావోయిస్టులకు ఆయుధాలు, పేలుడు పదార్ధాలు సరఫరా చేస్తున్న కేసులో ఎన్ఐఏ (National Investigation Agency) సోదాలు నిర్వహించింది. ఏపీ, ఛత్తీస్ఘడ్, ఒడిశాలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. అల్లూరి జిల్లాలోని చింతూరులో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ కొన్ని డిజిటల్ పరికరాలు, పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో సంబంధం ఉన్న ఏడుగురు నిందితుల ఇళ్లలో సోదాలు చేసింది.
ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబంధించి ఎన్ఐఏ ఇద్దరిని అరెస్టు చేసింది. వీరి వద్ద నుంచి పేలుడు పదార్ధాలు, విప్లవ సాహిత్యం, నగదు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించింది. చింతూరు పోలీసులు నమోదు చేసిన కేసును 2024 సెప్టెంబరులో తీసుకుని ఎన్ఐఏ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మావోయిస్టులకు పెద్దఎత్తున ఆయుధాలు, ఇతర ఉపకరణాలు సరఫరా చేస్తున్న నెట్వర్క్ను ఎన్ఐఏ గుర్తించింది. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసు బలగాలను చంపేందుకు కుట్ర పన్నినట్టు ఎన్ఐఏ పేర్కొంది.