ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతపురంలో 'ఉగ్ర' కలకలం - సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను అరెస్టు చేసిన ఎన్ఐఏ - NIA arrested an IT employee - NIA ARRESTED AN IT EMPLOYEE

NIA arrested an IT employee: అనంతపురం జిల్లా రాయదుర్గంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సోయేల్‌ను ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేశారు. ఉగ్రవాదులతో అతడికి సంబంధాలు ఉన్నట్టు ఎన్‌ఐఏ అధికారులకు సమాచారం అందింది. సోయేల్‌ అనే వ్యక్తికి ఉగ్రవాదులతో సంబంధాలున్నట్టు ఎన్‌ఐఏ గుర్తించడంతో అధికారులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా రాయదుర్గంలో మూడు రోజులుగా రెక్కీ నిర్వహించిన అధికారులు సోయేల్​ను అరెస్ట్ చేశారు.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 21, 2024, 10:14 PM IST

Updated : May 22, 2024, 7:13 AM IST

అనంతపురంలో 'ఉగ్ర' కలకలం - సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను అరెస్టు చేసిన ఎన్ఐఏ (ETV Bharat)

NIA Arrested an IT Employee in Rayadurgam :అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఉగ్రవాదులతో సంబంధాలున్న ఐటీ ఉద్యోగిని గుర్తించారు. రాయదుర్గంలో విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్ గఫూర్ ఇంటి వద్ద మూడు రోజులుగా రెక్కీ నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు తెల్లవారుజామున సాయుధ పోలీసులతో వచ్చి ఇంటిని చుట్టుముట్టారు. నాగులభావి వీధిలో ఏ ఒక్కరినీ వెలుపలికి రానీయకుండా అబ్దుల్ గఫూర్ కుమారుడు ఐటీ ఉద్యోగి సోయేల్ ను మూడు గంటలపాటు విచారించారు. ఇంటి తలుపులు మూసేసిన ఎన్‌ఐఏ అధికారులు, కుటుంబ సభ్యుల నుంచి ఫోన్లు లాక్కొని, అందరినీ ఓ గదిలో కూర్చోబెట్టి, సోయేల్ ను, అతని కుటుంబ సభ్యులను విచారించారు.

మక్కాకు వెళ్లినప్పుడు సోయేల్​కు ఉగ్రవాదులతో పరిచయం ఏర్పడి, అది స్నేహంగా మారడంతో బెంగుళూరులో ఒకే గదిలో నివసించే వరకు పరిస్థితి వెళ్లినట్లు ఎన్‌ఐఏ ప్రాథమిక ఆధారాలు సేకరించింది. బెంగుళూరులో రామేశ్వరం కేఫ్​లో పేలుళ్ల నిందితులు, సోయేల్​తో ఒకే గదిలో నివసించిన సమాచారంపై కూడా ఎన్‌ఐఏ దర్యాప్తు ప్రారంభించింది. బెంగుళూరులో ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్న అనేక మంది ఉగ్రవాదులతో రాయదుర్గం సోయేల్​కు సంబంధాలున్నట్లు ఎన్‌ఐఏ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

రాయదుర్గం నాగులభావి వీధిలో ఉంటుంన్న విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్ గఫూర్​కు ఇద్దరు కుమారులు. వీలో సోయేల్ ఒకరు. సోయేల్ బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. ఆయన ఈ మధ్య మక్కా పర్యటనకు వెళ్లిన సందర్భంలో అక్కడ ఉగ్రవాదులతో పరిచయం ఏర్పడినట్లు సమాచారం. ఈ పరిచయంతో వారితో సామాజిక మాధ్యమాల్లో ఛాటింగ్ చేసినట్లు గుర్తించిన ఎన్‌ఐఏ అధికారులు, మరింత లోతుగా దర్యాప్తు చేశారని సమాచారం.

ఇటీవల బెంగుళూరులోని రామేశ్వరం కేఫ్​లో పేలుళ్లు జరిగాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఐఏ అధికారులకు సోయేల్ ఛాటింగ్, కాల్ లిస్టు వివరాలు లభించినట్లు తెలిసింది. ఆ మేరకు లోతుగా దర్యాప్తు చేసిన ఎన్‌ఐఏ అధికారులు, రామేశ్వరం కేఫ్ పేలుళ్ల నిందితుడు సోయేల్​తో కలిసి బెంగుళూరులోని గదిలో ఉన్నట్లు ప్రాథమిక సమాచారం సేకరించారు. ప్రస్తుతం సోయేల్ వర్క్ ఫ్రం హోం విధానంలో పని చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎన్ఐఏ అధికారులు మూడు రోజులపాటు రాయదుర్గంలో సోయేల్ నివాసం ఉంటున్న నాగులభావి వీధిలో రెక్కి నిర్వహించినట్లు సమాచారం. మంగళవారం తెల్లవారుజామున రాయదుర్గం చేరుకున్న ఎన్‌ఐఏ అధికారులు స్థానిక పోలీసుల సహకారంతో సోయేల్ ఇంట్లోకి ప్రవేశించి మూడు గంటల పాటు విచారణ చేపట్టారు.

NIA Raids in Telugu States : తెలుగు రాష్ట్రాల్లో ఏకకాలంలో ఎన్​ఐఏ సోదాలు.. పలు పత్రాలు స్వాధీనం

ఈ సందర్భంగా ఇంటి తలుపులు మూసేసి ఎవరినీ లోపలికి అనుమతించకుండా విచారణ నిర్వహించారు. ఆ వీధిలోని ఏ ఒక్కరినీ వెలుపలికి అనుమతించకుండా గట్టి నిఘాపెట్టి దర్యాప్తు సాగించారు. ఇంట్లో విచారణ పూర్తయ్యాక, సోయేల్ కు చెందిన సెల్ ఫోన్, ల్యాప్ టాప్​ను స్వాధీనం చేసుకొని, నిందితుడిని రాయదుర్గం పోలీసు స్టేషన్​కు తీసుకెళ్లారు. పీఎస్ లో సుమారు మూడున్నర గంటలపాటు ప్రత్యేక గదిలో విచారించిన ఎన్‌ఐఏ అధికారులు, స్థానిక పోలీసులను కూడా లోపలికి అనుమతించలేదు. సోయేల్ చెప్పిన వివరాల మేరకు, ఉగ్రవాదులకు సంబంధించిన మరింత సమాచారం రాబట్టడానికి ఎన్‌ఐఏ అధికారులు నిందితుడిని తమతో పాటు బెంగుళూరుకు తీసుకెళ్లారు. సోయేల్ ను అదుపులోకి తీసుకొని, బెంగుళూరుకు తరలిస్తున్న సమాచారం నిందితుడి కుటుంబ సభ్యులకు నోటీసు ఇచ్చి వెళ్లారు. వారిని బెంగుళూరుకు రావాలని ఎన్‌ఐఏ అధికారులు సోయేల్ కుటుంబ సభ్యులకు చెప్పినట్లు సమాచారం.

'అతడి' ఆచూకీ చెబితే రూ.10లక్షలు నజరానా- బాంబ్ బ్లాస్ట్ కేసులో ఎన్​ఐఏ ప్రకటన

Last Updated : May 22, 2024, 7:13 AM IST

ABOUT THE AUTHOR

...view details