New Ration Cards in Telangana :తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వారందరికీ శుభవార్త వినిపించింది. లక్ష కొత్త రేషన్ కార్డులను ఒకే రోజున పంపిణీ చేయనుంది. దీనికి ముహూర్తం కూడా ఖరారు చేసింది. మరి అది ఎప్పుడు? అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వక సంవత్సరాలు గడుస్తున్నాయి. రాష్ట్రంలో 2014 నుంచి కొత్త కార్డులు జారీ చేయలేదు. ఈ క్రమంలో లబ్ధిదారుల సంఖ్య చాలా పెరిగింది. ఈ పది సంవత్సరాలలో పెళ్లి చేసుకొని అత్తగారింటికి వచ్చిన కోడళ్లు, కొత్తగా జన్మించిన పిల్లలు రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. ఇది వరకే ప్రజాపాలన, గ్రామ సభల్లో అఫ్లికేషన్లు పెట్టుకోగా, ఇటీవల మీ సేవ కేంద్రాలద్వారా కూడా అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. తాజాగా రేషన్ కార్డుల పంపిణీపై ప్రభుత్వం నుంచి ముఖ్య అప్డేట్ వచ్చింది. లబ్ధిదారులకు కొత్త కార్డులు పంపిణీ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది.
జనవరి 26న రాష్ట్రవ్యాప్తంగా 16,900 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయగా, మార్చి 1న హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం తాజాగా డిసైడ్ అయింది. మార్చి 1వ తేదీన ఒకేసారి లక్ష కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేయనుంది. వచ్చే నెల 1న మూడు జిల్లాల పరిధిలో దాదాపు లక్ష మందికి పైగా కొత్తగా రేషన్‌కార్డులు ఇవ్వనున్నారు. కొత్త జిల్లాల ప్రకారంగా వికారాబాద్ జిల్లాలో ఇరవై రెండు వేలు, నాగర్‌కర్నూల్ జిల్లాలో 15 వేలు, వనపర్తి జిల్లాలో 6 వేలు, నారాయణపేట జిల్లాలో 12 వేలు, మహబూబ్‌నగర్ జిల్లాలో 13 వేలు, గద్వాల జిల్లాలో 13 వేలు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 6 వేలు, రంగారెడ్డి జిల్లాలో 24 వేలు, హైదరాబాద్ నగరంలో 285 మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేసినట్లు సమాచారం.