Neha Reddy Illegal Constructions Demolition: విశాఖపట్టణం జిల్లా భీమిలి సముద్ర తీరంలో YSRCP నేత, ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి సీఆర్‌జెడ్ (Coastal Regulation Zone) నిబంధనలు ఉల్లఘించి చేపట్టిన కాంక్రీట్ నిర్మాణాలను జీవీఎంసీ అధికారులు నేలమట్టం చేశారు. బీచ్‌లో ప్లాట్ఫారం నుంచి పైకి పది అడుగులు నిర్మించిన రక్షణ గోడను కొన్ని అడుగులు మాత్రమే కూల్చివేసిన జీవీఎంసీ అధికారులు, హైకోర్టు ఆదేశాలతో ప్లాట్ఫారం వరకు రెండోసారి కూల్చివేస్తున్నారు.
విశాఖలోని అక్రమ నిర్మాణాలపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ వేసిన పిల్‌పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో కూల్చివేతలు జరుగుతున్నాయి. కూల్చివేతకు అయ్యే ఖర్చులు నేహా రెడ్డి నుంచి వసూలు చేయాలంటూ ఇటీవల న్యాయస్థానం జీవీఎంసీ అధికారులను ఆదేశించింది.