NDA Leaders Complaint to Governor: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై జరిగిన రాళ్ల దాడి యత్నం ఘటనలపై కూటమి నేతలు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు ఫిర్యాదు చేశారు. అదే విధంగా సిట్ కార్యాలయం వద్ద కీలక పత్రాల దహనం చేసిన ఘటనపై కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు గవర్నర్‌ను కలిసిన వారిలో వర్ల రామయ్య, పాతూరి నాగభూషణం, షరీఫ్ తదితరులున్నారు.
అనంతరం వర్ల రామయ్య మీడియాతో మాట్లాడారు. జగన్‌పై రాయి దాడి ఓ డ్రామా అని విమర్శించారు. ఆ డ్రామా విఫలమైందని వైసీపీ నేతలకూ తెలుసని అన్నారు. ఈ ఘటనపై విజయవాడ సీపీతో కాకుండా సీబీఐతో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా చంద్రబాబుపై పెట్టిన తప్పుడు కేసుల పత్రాలన్నీ తగలబెట్టారన్న వర్ల రామయ్య, తప్పుడు కేసుల పత్రాల కాల్చివేతలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, సిట్ అధిపతి కొల్లి రాఘురామిరెడ్డి పాత్ర ఉందని మండిపడ్డారు. కొల్లి రాఘురామిరెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అని డిమాండ్ చేశారు. డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఉంటే ఎన్నికలు సజావుగా జరగవని ఆరోపించారు.
ఓటమి భయంతో సానుభూతి కోసమే జగన్ గులకరాయి దాడి డ్రామా: బొండా ఉమ - bonda uma on jagan stone attack
సీఎస్‌ను కూడా ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కోరామని వర్ల రామయ్య తెలిపారు. తాము చెప్పిన విషయాలపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని అన్నారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో రాయి డ్రామా చేస్తున్నారని టీడీపీ నేత షరిఫ్ విమర్శించారు. దర్యాప్తు చేయకుండా పోలీసు హత్యానేరమని చెప్పడం దారుణమని మండిపడ్డారు. 2019లో కోడికత్తి డ్రామా అని, ఇప్పుడు రాయి డ్రామా చేస్తున్నారని జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గులకరాయి వేసిన వ్యక్తిని కనిపెడితే 2 లక్షలు బహుమతి అని పోలీసులు పత్రిక ప్రకటన చేస్తారా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. రానున్న ఎన్నికలు రాష్ట్రంలో ఉన్న యువత భవిష్యత్తును నిర్దేశిస్తాయన్నారు.