NDA Government Planning To Implement Chandranna Bima Scheme : రాష్ట్రంలోని పేదలందరికీ వర్తించేలా చంద్రన్న బీమా పథకం సిద్ధమవుతోంది. కుటుంబంలో సంపాదనపరుడికే కాకుండా కుటుంబసభ్యులందరినీ బీమా పరిధిలోకి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కోటీ 21 లక్షల కుటుంబాల్లోని 3 కోట్ల మందికిపైగా ప్రయోజనం చేకూరేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.
కార్మికులు, పేదలకు బీమా వర్తింపజేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ సారి కుటుంబం మొత్తానికీ బీమా వర్తింపజేసేలా కార్యాచరణ తయారవుతోంది. గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం బీమా పథకాన్ని సక్రమంగా అమలు చేయకపోవడం వల్ల కార్మికులు, పేదలు మరింత కుదేలయ్యారు. కూటమి ప్రభుత్వం చంద్రన్న బీమా పథకాన్ని సమర్థంగా అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ పథకం రూపకల్పనపై ఐఏఎస్ (IAS), ఐఎఫ్ఎస్ (IFS) అధికారులతో ఏర్పాటు చేసిన కమిటీ ప్రభుత్వానికి త్వరలో సమగ్ర నివేదిక అందజేయనుంది.
18 నుంచి 70 ఏళ్ల మధ్యవారు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షలు, సహజ మరణానికి 2 లక్షల రూపాయలు బీమా చెల్లించాలని ఆరుగురు అధికారుల బృందం ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు సూచనల మేరకు మార్పులు చేర్పులు చేసి పథకం అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. కుటుంబం మొత్తానికీ బీమా వర్తింపజేయడంతోపాటు బీమా మొత్తాన్ని పెంచడం పట్ల కార్మిక వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతోంది.
రాష్ట్ర ప్రజలకు గుడ్న్యూస్ - చెత్త పన్ను ఎత్తేసిన చంద్రన్న సర్కార్ - Abolition Garbage Tax in AP