ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీపీఎస్సీని భ్రష్టు పట్టించిన జగన్‌కి హైకోర్టు తీర్పు చెంపపెట్టు: నారా లోకేశ్ - Nara Lokesh on APPSC Group 1

APPSC Group 1 Mains Cancellation: 2018లో జరిగిన గ్రూప్-1 మూల్యాంకనంలో అవ‌క‌త‌వ‌క‌ల‌ను నిర్ధారిస్తూ మెయిన్స్​ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు. ఏపీపీఎస్సీని భ్రష్టు పట్టించిన జగన్‌కి హైకోర్టు తీర్పు చెంపపెట్టని విమర్శించారు. ఏపీపీఎస్సీని జగన్ వైసీపీఎస్సీగా మార్చేసి పూర్తిగా భ్రష్టు పట్టించారని ఆరోపించారు.

APPSC Group 1 Mains Cancellation
APPSC Group 1 Mains Cancellation

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 13, 2024, 8:01 PM IST

APPSC Group 1 Mains Cancellation:2018 గ్రూప్-1 మూల్యాంకనంలో అవ‌క‌త‌వ‌క‌ల‌పై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందిచారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో గ్రూప్-1 పరీక్షలు పకడ్బందిగా నిర్వహిస్తే, ప‌రీక్షల వ్యవ‌స్థని, మూల్యాంక‌నాన్ని, ఇంట‌ర్వ్యూ ప‌ద్ధతులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పాత‌రేసిందని లోకేశ్ ఆరోపించారు. పేప‌ర్లు 3 సార్లు మూల్యాంకనం చేసి, అర్హులంద‌రినీ త‌ప్పించి, త‌మ‌వారికి పోస్టులొచ్చేలా మార్కులు మార్చేసి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడార‌ని లోకేశ్ ధ్వజమెత్తారు.

హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: ఏపీపీఎస్సీని జగన్ వైసీపీఎస్సీగా మార్చేసి పూర్తిగా భ్రష్టు పట్టించారని నారా లోకేశ్ మండిపడ్డారు. 2018 గ్రూప్-1 మూల్యాంకనంలో అవ‌క‌త‌వ‌క‌ల‌ను నిర్ధారిస్తూ మెయిన్స్ ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామ‌ని తెలిపారు. హైకోర్టు తీర్పు ఉన్మాద పాలకుడు జగన్ కి చెంపపెట్టు అన్నారు. ప్రతిప‌క్షనేత‌గా జ‌గ‌న్ 2.30 ల‌క్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తాన‌ని హామీ ఇచ్చారని లోకేశ్ గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి ఏటా జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేస్తాన‌ని ఇచ్చిన హామీని సీఎం జగన్ విస్మరించార‌ని ధ్వజమెత్తారు.

2018 గ్రూప్‌-1 మెయిన్స్​ రద్దు - ఏపీ హైకోర్టు కీలక తీర్పు

ఏపీపీఎస్సీ స‌భ్యులుగా జగన్ బంధువులు: గత టీడీపీ ప్రభుత్వంలో 169 గ్రూప్‌-1 ఉద్యోగాల భ‌ర్తీకి 2018లో నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్షలు పారదర్శకంగా నిర్వహించామని లోకేశ్ గుర్తుచేశారు. అధికారంలోకి వ‌చ్చిన వైఎస్సార్సీపీ, గ్రూప్ 1 మెయిన్స్ ప‌రీక్షల మూల్యాంక‌నంలో అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్పడింద‌ని లోకేశ్ ఆరోపించారు. ఎటువంటి అర్హత‌లు లేకున్నా వైఎస్సార్సీపీ నేతలు, జగన్ బంధువులు ఏపీపీఎస్సీ స‌భ్యులుగా చేర్చారని ఆరోపించారు. తద్వారా మొత్తం ప‌రీక్షల వ్యవ‌స్థని, మూల్యాంక‌నాన్ని, ఇంట‌ర్వ్యూ ప‌ద్ధతుల్ని పాత‌రేశార‌ని మండిప‌డ్డారు. టీడీపీ హ‌యాంలో ప్రిలిమ్స్, మెయిన్స్ ప‌రీక్షలు రాసిన ప్రతిభావంతుల పేప‌ర్లు 3 సార్లు మూల్యాంకనం చేసి, అర్హులంద‌రినీ త‌ప్పించి, త‌మ‌వారికి పోస్టులొచ్చేలా మార్కులు మార్చేసి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడార‌ని లోకేశ్ ధ్వజమెత్తారు.

నిరుద్యోగుల తరుఫున పోరాడుతాం:49 వేల ఓఎంఆర్ షీట్లు మార్చేశార‌ని నిరుద్యోగ జేఏసీ, విద్యార్థి సంఘాలు చేస్తున్న ఆరోప‌ణ‌లపై జ‌గ‌న్ స‌ర్కారు మౌనం వ‌హించ‌డాన్ని తప్పుబట్టారు. ప్రజాఆకాంక్షల మేర‌కు త్వర‌లో కూట‌మి ప్రభుత్వం ఏర్పడుతుంద‌ని, కోర్టు ఆదేశాల మేరకు పార‌ద‌ర్శకంగా ప్రభుత్వ ఉద్యోగాల‌న్నీ భ‌ర్తీ చేస్తామ‌ని హామీ నిరుద్యోగులకు లోకేశ్ హామీ ఇచ్చారు. గ్రూప్-1 అభ్యర్థులు, నిరుద్యోగులు అధైర్యప‌డొద్దని తెలుగుదేశం నిరుద్యోగుల తరుఫున పోరాడుతుందని లోకేశ్ భ‌రోసా ఇచ్చారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల పొత్తు రాష్ట్రాభివృద్ధికి ఎంతో అవసరమని, యువతకు ఉద్యోగావకాశాలు మెరుగుపడాలన్నా, రైతుల బతుకులు బాగుపడాలన్నా, ఈ పొత్తు ఎంతో దోహదపడుతుందన్నారు.

గ్రూప్​-2 స్క్రీనింగ్​ ఫలితాల విడుదల

ABOUT THE AUTHOR

...view details