NARA LOKESH ON STONE ATTACK ON JAGAN : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన గులకరాయి దాడి కేసులో ఐదుమంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అజిత్‌సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన యువకులుగా అనుమానిస్తున్న పోలీసులు స్థానికులు తీసిన వీడియోలను పరిశీలించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ ఆధ్వర్యంలో అనుమానితులను అదుపులోకి తీసుకుని సీసీఎస్ పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. ఈ విషయంపై టీడీపీ నేతలు స్పందించారు.
మండదా అక్కా! మండదా అన్నా! :ముఖ్యమంత్రి జగన్మోహన్పై రాయి దాడి అంశంలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. క్వార్టర్ మేటర్ దగ్గరే జగన్‌పై దాడి జరిగిందంటూ లోకేశ్ సెటైర్లు వేశారు. క్వార్టర్ మందుతో పాటు ఇస్తానన్న 350 ఇవ్వనందుకే దాడి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. "మండదా అక్కా! మండదా చెల్లీ! మండదా తమ్ముడు! మండదా అన్నా!" అంటూ జగన్ ప్రసంగం డైలాగులనే ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. "కోడికత్తి డ్రామా 2 (KodiKathiDrama2) " వైఎస్సార్సీపీ అంతం అంటూ పోస్ట్ చేశారు.
జగన్‌పై గులకరాయి దాడి కేసులో పురోగతి - పోలీసుల అదుపులో ఐదుగురు యువకులు - stone Attack on Jagan