నాడు వద్దన్న వారే నేడు ఘన స్వాగతం పలికారు.. Nara Lokesh election campaign:మంగళగిరి నియోజక వర్గం తాడేపల్లిలో ని క్రిస్టియన్ పేటలో తెలుగుదేశం జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ కు ఘన స్వాగతం లభించింది. మంగళగిరి నియోజక వర్గం వ్యాప్తంగా లోకేశ్ చేస్తున్న ప్రచారం ఒక ఎత్తు ఐయితే క్రిస్టియన్ పేటలో చేసినా ప్రచారం మరో ఎత్తుగా సాగింది. స్వయాన సీఎం జగన్మోహన్రెడ్డి నివాసానికి అనుకుని ఉన్న క్రిస్టియన్ పేటకు లోకేశ్ కు ఉన్న ఫ్లాష్ బ్యాక్ ఏమిటో ఎప్పుడు చూద్దాం.
సరిగ్గా 5ఏళ్ల క్రితం, అది 2019వ సంవత్సరం ఎన్నికల పోలింగ్ జరుగుతున్న రోజు తాడేపల్లి లోని జగన్మోహన్ రెడ్డి నివాసానికి కూత వేటు దూరంలో ఉన్న క్రిస్టియన్ పేట పోలింగ్ బూత్ లో దొంగ ఓట్లు వేసేందుకు వైసీపీ సిద్ధమైంది. విషయం తెలుసుకుని అడ్డుకునేందుకు అక్కడికి వెళ్లిన నారా లోకేశ్ ను స్థానికులు అడ్డుకున్నారు. దుమ్ములేపి, గొడవ చేసి అక్కడ ఉండొద్దంటే ఉండొద్దని గోల గోల చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని లోకేశ్ ను అక్కడినుంచి పంపివేసారు. పోలింగ్ రోజు ఘర్షణ వాతావరణం వద్దనుకున్న లోకేశ్ అక్కడినుంచి మౌనం గా వెనుదిరిగారు.
సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలు కొనసాగాలంటే మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం రావాలి: లోకేశ్ - Lokesh Campaign at Coimbatore
ఐదు సంవత్సరాలు గడిచాయి. మరో మారు ఎన్నికలు వచ్చాయి, తాము నమ్మి గెలిపించుకున్న నాయకుడు తమ చెంతనే ఉండి కూడా నట్టేట ముంచాడు. ఈ విషయం తెలుసుకోవడానికి క్రిస్టియన్ పేట వాసులకు ఎంతో సమయం పట్టలేదు. నోరెత్తి ఇబ్బందులు చెప్పుకుందామనుకున్నా, వివిధ ఘటనలు చూసాక నోరెత్తే సాహసం చేయలేదు. వివిధ వర్గాలపై దాడులు చూశాక సమస్య చెప్పుకునే ప్రయత్నమూ చేయలేదు. ముఖ్యమంత్రి నివాసానికి అతి సమీప వాసులనే పేరే కానీ, బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన దుస్థితే వారిది. బాగు పడతారనుకున్న బిడ్డలు ఉద్యోగాలు లేక గంజాయి బానిసలయ్యారు. చేసేందుకు పనులు లేక, బతికేందుకు భవిష్యత్తు కనిపించక అలానే మౌనంగా ఉండిపోయారు.
ట్యాపింగ్, హ్యాకింగ్ జరుగుతోంది జాగ్రత్త - లోకేశ్‌కు యాపిల్ సంస్థ సెక్యూరిటీ అలర్ట్ - Security Alert to Nara Lokesh
కాలం గిర్రున తిరిగింది ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వచ్చాయి. అదే క్రిస్టియన్ పేట, అక్కడికే నారా లోకేశ్ ప్రచారంలో భాగంగా మళ్లీ వెళ్లారు. గతంలో రాళ్లతో స్వాగతం పలికి క్రిస్టియన్ పేట వాసులు ఈ సారి లోకేశ్‌కు పూలవర్షంతో స్వాగతం పలికారు. యువత కేరింతలు, మేళతాళాల తో ఘనస్వాగతం లభించింది. ఒక్క అవకాశం అనే మాటకు నమ్మి మోసపోయామనే పశ్చాత్తాపం ప్రతీ కంటా కనిపించింది. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ నినాదం తో లోకేశ్ వెంట సై అంటూ కాలనీ మొత్తం ఏకమై తరలివచ్చింది. ప్రతీ ఒక్కరి సమస్యా తీరుస్తానంటూ, భవిష్యత్తు కు భరోసా కల్పిస్తూ లోకేశ్ అడుగులు ముందుకు సాగాయి.
బూత్, అసెంబ్లీ, పార్లమెంట్ పరిధిలో సమావేశాలు - ఎన్డీఏ నేతల నిర్ణయం - bjp tdp janasena leaders meeting