Nara Bhuvaneshwari Nijam Gelavali Yatra in Paderu : చంద్రబాబు సతీమణి భువనేశ్వరి 'నిజం గెలవాలి' పర్యటనలో భాగంగా ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించారు. టీడీపీ కార్యకర్తలు, కుటుంబాలకు న్యాయం చేయాలని ఉద్దేశంతోనే నిజం గెలవాలి కార్యక్రమాన్ని చేపట్టినట్లు భువనేశ్వరి పేర్కొన్నారు.జిల్లాలోని అరకు (Araku) మండలం ముసిరిగుడ గ్రామంలో గుండెపోటుతో మృతి చెందిన బసు కుటుంబాన్ని ఆమె పరామర్శించి బాధిత కుటుంబాన్ని ఓదార్చారు.
కర్నూలు జిల్లాలో నిజం గెలవాలి యాత్ర - పలు కుటుంబాలకు నారా భువనేశ్వరి పరామర్శ
Tribals Given Letter To Bhuvaneshwari Cancel GO No3: నారా భువనేశ్వరికి గిరిజనులు, టీడీపీ కార్యకర్తలు స్వాగతం పలికారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని భువనేశ్వరి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బసు కుటుంబానికి చంద్రబాబు పంపిన లేఖను భువనేశ్వరి అందజేశారు. జీవో నెం3 (GO No3) రద్దు చేయాలని కోరుతూ గిరిజనులు భువనేశ్వరికి వినతి పత్రం అందించారు.
Bhuvaneshwari Tastes Araku Coffee: భువనేశ్వరి అరకు కాఫీ రుచి చూశారు. అరకు నియోజకవర్గంలో "నిజం గెలవాలి" పర్యటనకు వెళ్లిన ఆమె గోల్డ్ కాఫీ సెంటర్ వద్ద కాఫీని ఆస్వాదించారు. తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి దొన్నుదొర అరకు కాఫీ ప్రాముఖ్యతను భువనేశ్వరికి వివరించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇక్కడి కాఫీ తోటల పెంపకాన్ని ఎంతో ప్రోత్సహించిన విషయం గుర్తు చేశారు. దీనిపై స్పందించిన చంద్రబాబు మన గిరిజన సోదరులు పండించిన అరకు కాఫీ ఎలా ఉందంటూ ఎక్స్‌లో భువనేశ్వరిని ట్యాగ్ చేశారు. కాఫీని ఆస్వాదించిన తర్వాత అరకు అందాలను, ఆహ్లాదకరమైన ప్రదేశాలను భువనేశ్వరి సందర్శించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా ప్రోత్సహించేలా మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉందని భువనేశ్వరి అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం పాలనలో అరకు ప్రాంతాన్ని, కాఫీ తోటల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు మరింత చొరవ తీసుకోవాలని చంద్రబాబుకు వివరిస్తామని స్థానికులకు భువనేశ్వరితెలిపారు.