Nara Bhuvaneshwari Filed Nomination on Behalf of Chandrababu:చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు తరపున ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఇవాళ ఎన్నికల నామినేషన్ పత్రాలు సమర్పించారు. లక్ష్మీపురం ఆలయంలో నామినేషన్ పత్రాలకు పూజలు నిర్వహించి టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన టీడీపీ శ్రేణులు అభిమానుల మధ్య ఊరేగింపుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్న భువనేశ్వరి చంద్రబాబు తరపున నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పించారు. టీడీపీ ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు వేలాదిగా రావడంతో కుప్పం రోడ్లు పసుపు మయంగా మారాయి. నామినేషన్ పత్రాల సమర్పణలో నారా భువనేశ్వరితో పాటుగా ఎమ్మెల్సీ శ్రీకాంత్, కుప్పం పార్టీ బాధ్యుడు మునిరత్నం పాల్గొన్నారు.
హిందూపురం టీడీపీ అభ్యర్థిగా బాలయ్య నామినేషన్ - BALAKRISHNA NOMINIATaION
తొలిరోజు దాఖలైన నామినేషన్లు: రాష్ట్రంలో తొలిరోజు 229 నామినేషన్లు దాఖలయ్యాయి. లోక్సభ స్థానాలకు 39 నామినేషన్లు, శాసనసభ స్థానాలకు 190 నామినేషన్లు దాఖలయ్యాయి. వైఎస్సార్సీపీ, ఎన్డీఏ, స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు వేశారు. ఈరోజు కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గురువారం మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ తరఫున బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నేతలు రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.