Nalgonda Hospital Superintendent Bribe Case : ఏసీబీ వలకు మరో అవినీతి తిమింగలం చిక్కింది. రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ లచ్చునాయక్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. ఔషధాల టెండర్ కోసం ఓ వ్యాపారిని ఆయన రూ.3 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని(ACB)ఆశ్రయించాడు. ఈరోజు తన ఇంట్లోనే లంచం తీసుకుంటుండగా అధికారులు అతణ్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రెండేళ్ల క్రితం బదిలిపై నల్గొండకు వచ్చిన లచ్చునాయక్‌పై గతంలోను పలు ఆరోపణలు ఉన్నాయి.
ACB Caught Nalgonda Hospital Superintendent : నల్గొండకు చెందిన రాపోల్ వెంకన్న అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా రవి ఏజెన్సీ పేరుతో మెడికల్ డిస్ట్రిబ్యూటర్ దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. రెండేళ్ల క్రితం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి జనరల్ మెడిసిన్ పంపిణీ చేయడానికి టెండర్ ద్వారా కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఆయనకు అప్పడే బదిలీపై వచ్చిన సూపరింటెండెంట్ డాక్టర్.లచ్చునాయక్ ( SuperintendentLachunayak) పరిచమయ్యారు.
బాసు లంచం అడిగావో జైలు ఖాయమంటున్న ఏసీబీ అధికారులు
ACB Traps Nalgonda Hospital Superintendent : ఈ క్రమంలోనే ఆసుపత్రిలో కొన్ని మందులు అత్యవసర పరిస్థితుల్లో సరాఫరా చేయడానికి టెండర్ పిలుస్తున్నామని, అందులో 10 శాతం కమీషన్ తనకు ఇస్తే టెండర్ మీకు వస్తోందని లచ్చునాయక్ రాపోల్ వెంకన్నకు తెలిపారు. దీంతో ఇరువురూ ఓ ఒప్పందం చేసుకున్నారు. అనుకున్నా దాని ప్రకారం ఆయన సూపరింటెండెంట్‌కు కమీషన్ ఇచ్చారు. మూడు నెలలు క్రితం కమీషన్ పెంచాలని లేదంటే టెండర్ పిలిచి మరోకరికి ఇస్తామని లచ్చునాయక్ రాపోల్ వెంకన్నను బెదిరించాడు.