ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రజాతీర్పును జగన్ గౌరవించకపోతే ఎలా?' - వైఎస్సార్సీపీకి మరో ఇద్దరు గుడ్​ బై - AVANTHI SRINIVAS QUIT YSRCP

వైఎస్సార్సీపీ అధినేత జగన్‌కు షాక్‌ ఇస్తున్న పలువురు నేతలు - పార్టీకి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, గ్రంధి శ్రీనివాస్‌ రాజీనామా

Avanthi Srinivas Quit YSRCP
Avanthi Srinivas Quit YSRCP (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 12, 2024, 12:48 PM IST

Updated : Dec 12, 2024, 4:49 PM IST

Avanthi Srinivas Quit YSRCP :ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్సార్సీపీకి షాక్​ల మీద షాక్​లు తగులుతున్నాయి. ఆ పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు నచ్చక కొందరు రాజీనామా బాట పట్టారు. మరికొందరు వేరే పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే కీలక నాయకులంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడారు. పలువురు మేయర్లు, కౌన్సిలర్లు గుడ్​ బై చెప్పేశారు. తాజాగా వైఎస్సార్సీపీకి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్), భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ రాజీనామా చేశారు.

విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వైఎస్సార్సీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్‌, ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్‌ విజయసాయిరెడ్డికి పంపినట్లు అవంతి పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును జగన్‌ గౌరవించాలని చెప్పారు. ఐదు సంవత్సరాలు పాలించాలని కూటమికి ప్రజలు తీర్పు ఇచ్చారని తెలిపారు. కనీసం ఐదు నెలల కూడా సమయం ఇవ్వకుండా ధర్నాలు అంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు.

వైఎస్సార్సీపీలో కార్యకర్తలు నలిగిపోయారని ముత్తంశెట్టి శ్రీనివాసరావు వివరించారు. పార్టీ అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని చెప్పారు. ఐదేళ్లు శ్రేణులందరూ ఇబ్బంది పడ్డారని వాపోయారు. ఇప్పుడు మళ్లీ వాళ్లను రోడ్డెక్కమనడం సరికాదన్నారు. తాడేపల్లిలో కూర్చుని ఆయన (జగన్‌ను ఉద్దేశించి) ఆదేశాలిస్తారని కానీ క్షేత్రస్థాయిలో క్యాడర్ ఇబ్బంది ఎదుర్కొన్నట్లు వ్యాఖ్యానించారు. అందుకే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రకటించారు.

Grandhi Srinivas Resigned to YSRCP : రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ అయిన పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వైఎస్సార్సీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. గత కొంతకాలంగా అధిష్టాన వైఖరిపై గ్రంధి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2009లో పోటీకి దూరంగా ఉన్నారు. 2011లో భీమవరంలో ఇంటి వద్దనే జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. 2014లో వైఎస్సార్సీపీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం చెందారు.

ఇక 2019లో జనసేన అధినేత పవన్ కల్యాణ్​పై వైఎస్సార్సీపీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిన గ్రంధి శ్రీనివాస్​ సుమారు ఎనిమిది వేల ఓట్ల మెజార్టీతో గెలిచి దేశవ్యాప్తంగా సంచలనమయ్యారు. అయితే పవన్​పై గెలిచినందుకు గ్రంధి శ్రీనివాస్​కు మంత్రి పదవి దక్కుతుందని రెండు దఫాలు కూడా నియోజకవర్గ ప్రజలు పార్టీ నాయకులు ఆశించారు. కానీ ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. చివరకు ప్రభుత్వ విప్ పదవి మాత్రమే దక్కింది. అయితే 2024 ఎన్నికల్లో భీమవరం నుండి గ్రంధి శ్రీనివాస్ మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేయగా ఓడిపోయారు.

అయితే పార్టీలోని కొంతమంది నియోజకవర్గ పెద్దలు తన ఓటమికి కారణమయ్యారని, వారిపై చర్యలు తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేసినప్పటికీ ఆయన స్పందించకపోవడంతో గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల ఆయన వైఎస్సార్సీపీకి రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరుతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ఈ నేపథ్యంలో నవంబర్​ ఆరో తేదీన జగన్మోహన్ రెడ్డిని గ్రంధి శ్రీనివాస్ కలిశారు. అదే సమయంలో గ్రంధి శ్రీనివాస్ ఇంటిపై, ఆయన వ్యాపారాలపై ఐటి అధికారులు దాడులు చేశారు. ఈ పరిస్థితుల్లో తనకున్న బాధ్యతలు మేరకు వచ్చే ఏడాది మే నెల వరకు తాను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటానని జగన్ మోహన్ రెడ్డి వద్ద గ్రంధి శ్రీనివాస్ స్పష్టం చేయడం జరిగింది.

ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ కార్యాలయంలో ముఖ్య అనుచరులతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం పార్టీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు గ్రంధి శ్రీనివాస్​ ప్రకటించారు. వ్యక్తిగత కారణాలవల్ల రాజీనామా చేస్తున్నానని, కొంతకాలం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని తెలిపారు.

'జగన్​కు బాధ్యత లేదు - గుడ్ బుక్​ కాదు గుండె బుక్ ఉండాలి' - వైఎస్సార్సీపీకి రాజీనామా

వైఎస్సార్సీపీకి మరో షాక్​ - పార్టీకి సామినేని ఉదయభాను రాజీనామా - జనసేనలో చేరుతానని ప్రకటన - Samineni Udayabhanu Resign to YSRCP

Last Updated : Dec 12, 2024, 4:49 PM IST

ABOUT THE AUTHOR

...view details