ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ట్రాఫిక్ మళ్లింపుపై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు - ఆటోనగర్ రోడ్లను పరిశీలించిన ఎంపీ కేశినేని - MP KESINENI NANI IN VIJAYAWADA

మహానాడు రోడ్డు నుంచి నిడమానూరు వరకు ఫ్లైఓవర్, గన్నవరం నుంచి వచ్చే మెట్రో పనులు పూర్తయితే విజయవాడకు ట్రాఫిక్ సమస్య ఉండదని ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి

MP KESINENI VISIT AUTONAGAR ROADS IN VIJAYAWADA
MP KESINENI VISIT AUTONAGAR ROADS IN VIJAYAWADA (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 30, 2024, 11:18 AM IST

MP Kesineni Sivanath Visit Auto Nagar Roads In Vijayawada:విజయవాడ ఆటోనగర్‌లో రోడ్లను ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కలెక్టర్ లక్ష్మీశ పరిశీలించారు. మెట్రో, ఏలూరు రోడ్డు ఫ్లైఓవర్ పనుల వల్ల ట్రాఫిక్​కు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాల కోసం ఏర్పాటు చేయనున్నారు. ఆటోనగర్​కు లారీల అంతరాయం లేకుండా వచ్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాల కోసం మురళీనగర్ నుంచి బల్లెం వారి వీధి వరకు రోడ్లు పరిశీలించారు.

గన్నవరం విమానాశ్రయానికి రామవరప్పాడు రింగ్ రోడ్డు నుంచి మరో ప్రత్యామ్నాయ మార్గం కోసం రోడ్లను పరిశీలించారు. రామవరప్పాడు రింగ్ రోడ్డు నుంచి కేసరిపల్లి వరకు ఎస్ఎల్వీ గ్రాండ్ మీదగా గన్నవరం ఎయిర్​పోర్టుకు ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలని కలెక్టర్ లక్ష్మీశకు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సూచించారు. ఎంపీ కేశినేని శివనాథ్ , ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సూచనలపై కలెక్టర్ లక్ష్మీశ సానుకూలంగా స్పందించారు. మహానాడు రోడ్డు నుంచి నిడమానూరు వరకు ఫ్లైఓవర్, గన్నవరం నుంచి వచ్చే మెట్రో పనులు పూర్తయితే విజయవాడకు ట్రాఫిక్ సమస్య ఉండదని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఈ లోపు ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ మార్గాల సిద్ధం చేసి తాత్కాలిక శాశ్వత రోడ్లు ఏర్పాటు చేస్తామని ఎంపీ శివనాథ్ ఈ సందర్భంగా వెల్లడించారు.

''మహానాడు రోడ్డు నుంచి నిడమానూరు వరకు ఫ్లైఓవర్, గన్నవరం నుంచి వచ్చే మెట్రో పనులు పూర్తయితే విజయవాడకు ట్రాఫిక్ సమస్య ఉండదు. రామవరప్పాడు రింగ్ రోడ్డు నుంచి కేసరిపల్లి వరకు ఎస్ఎల్వీ గ్రాండ్ మీదగా గన్నవరం ఎయిర్​పోర్టుకు ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేస్తాం'' - ఎంపీ కేశినేని శివనాథ్


గ‌న్నవ‌రం ఎయిర్ పోర్ట్ సేవలు విస్తరించాలి- కేంద్ర మంత్రి రామ్మోహన్​కు కేశినేని వినతి - Kesineni Meet Kinjarapu Rammohan

యువతను నైపుణ్య శిక్షణ ద్వారా తీర్చిదిద్దాలి : సీఎం చంద్రబాబు - CM Review on Employement and Sports

ABOUT THE AUTHOR

...view details