ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కార్ నంబర్ కాస్ట్లీ గురూ! - ఫ్యాన్సీ నంబర్ల మోజుతో కాసుల వర్షం! - FANCY NUMBER AUCTION

ఫాన్సీ నంబర్లపై వాహనదారుల్లో పెరుగుతున్న ఆసక్తి

FANCY_NUMBER_AUCTION
FANCY_NUMBER_AUCTION (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 15, 2024, 3:07 PM IST

Motorists Interested in Getting Fancy Numbers :రోజురోజుకు మార్కెట్లోకి ఎన్నో ప్రత్యేకతలున్న వాహనాలు వస్తుంటాయి. కొందరు తాము మెచ్చిన వాహనాన్ని కొనేందుకు రూ.లక్షలు ఖర్చు చేస్తుంటారు. అలాంటి వారు రిజిస్ట్రేషన్‌ నంబరు కూడా ప్రత్యేకంగా ఉండాలని అనుకుంటారు. ఎంత ఖర్చు అయినా సరే వేలం ద్వారా ఫ్యాన్సీ నంబర్లను దక్కించుకోవడానికి వెనుకాడారు. ఇలాంటి వాహనదారుల ఉత్సాహంతో రవాణా శాఖకు కాసుల వర్షం కురుస్తోంది.

ఒక్క రోజే ఆర్టీఏకు రూ. 5.06 లక్షల ఆదాయం :కరీంనగర్‌ జిల్లా రవాణా శాఖ గురువారం ( నవంబర్​ 14న) 6 ఫ్యాన్సీ నంబర్లకు రూ.1.35 లక్షల ఫీజు నిర్దేశించింది. ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌లో వేలం నిర్వహించింది. ఇందుకు కొందరు వాహనదారులు పోటీ పడి వాటిని దక్కించుకోగా రవాణా శాఖకు రూ.5.06 లక్షల ఆదాయం సమకూరింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ రేవంత్​ సర్కార్​ ఏర్పడిన తర్వాత టీఎస్‌ స్థానంలో టీజీని ప్రవేశపెట్టింది. ఈ సీరిస్‌ ప్రారంభించిన తర్వాత కరీంనగర్‌ రవాణా శాఖ కార్యాలయ పరిధిలో ఆన్‌లైన్‌ వేలం పాటలో టీజీ02 9999 నంబరుకు అత్యధిక ధర పలకడం విశేషం. గురువారం (నవంబర్​ 14) నుంచి టీజీ బి.0001 సిరీస్‌ ప్రారంభమైంది. దీంతో ఫ్యాన్సీ నంబర్ల కోసం పోటీ పెరిగిందని ఉమ్మడి జిల్లా ఉప రవాణా కమిషనర్‌ పెద్దింటి పురుషోత్తం వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details