ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా - ఈ నెల 22 లేదా 23న విచారణ జరపనున్న సీబీఐ ప్రత్యేక కోర్టు - Kavitha Bail Petition Postponed

MLC Kavitha Bail Petition Hearing Postponed : దిల్లీ మద్యం కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. జడ్జి సెలవులో ఉండటంతో, ఇవాళ జరగాల్సిన విచారణ పోస్ట్​పోన్​ అయింది. తదుపరి విచారణ ఈనెల 22 లేదా 23న జరపనున్నట్లు సీబీఐ ప్రత్యేక కోర్టు వెల్లడించింది.

MLC_Kavitha_Bail_Petition_Hearing_Postponed
MLC_Kavitha_Bail_Petition_Hearing_Postponed

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 16, 2024, 4:37 PM IST

MLC Kavitha Bail Petition Hearing Postponed:దిల్లీ లిక్కర్​ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత సాధారణ బెయిల్​ పిటిషన్​ విచారణ వాయిదా పడింది. జడ్జి సెలవులో ఉండటంతో ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో జరగాల్సిన విచారణను ఈనెల 22 లేదా 23న జరపనున్నట్లు సీబీఐ(CBI) ప్రత్యేక కోర్టు తెలిపింది. కాగా మద్యం పాలసీ ఈడీ మనీలాండరింగ్ కేసులో కవిత రెగ్యులర్​ బెయిల్ కోరుతున్నారు.

ఏడేళ్ల కంటే శిక్ష తక్కువ పడే కేసుల్లో అరెస్టు చేయొద్దని నిబంధనలు ఉన్నాయన్న ఆమె, తక్షణమే బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా కవిత తిహాడ్​ జైలులో ఉన్నారు. ఏప్రిల్ 23 వరకూ ఆమెకు రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court) జ్యుడిషియల్ కస్టడీవిధించిన సంగతి తెలిసిందే.

సీబీఐ కస్టడీలో కవిత - అప్రూవర్ల వాంగ్మూలాల ప్రకారం విచారణ ఇలా! - BRS Leader Kavitha Into CBI Custody

MLC Kavitha in Judicial Custody : ఎమ్మెల్సీ కవితకు విధించిన సీబీఐ కస్టడీ సోమవారంతో ముగియడంతో అధికారులు ఉదయం 10 గంటలకు ఆమెను న్యాయమూర్తి కావేరీ బవేజా ముందు హాజరుపరిచారు. ప్రస్తుతానికి ఆమెను కస్టడీలో విచారించాల్సిన అవసరంలేదని సీబీఐ న్యాయవాది తెలిపారు. ప్రముఖ రాజకీయ నాయకురాలు కావడం, తీవ్ర ప్రభావం చూపే శక్తి సామర్థ్యాలు ఉండటం వల్ల ఆమె సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది.

రౌస్​ అవెన్యూ కోర్టు అనుమతి - ఈ నెల 14 వరకు సీబీఐ కస్టడీకి ఎమ్మెల్సీ కవిత - MLC KAVITHA CBI CUSTODY

అందువల్ల ఈ కేసు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిందితురాలిని 14 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీకి(Judicial Custody) పంపాలని దర్యాప్తు సంస్థల న్యాయవాది, జడ్జి కావేరి బవేజాను విజ్ఞప్తి చేశారు. కవిత తరఫున హాజరైన లాయర్​ నితేశ్​రాణా సీబీఐ వాదనలను తోసిపుచ్చారు. కవిత సమాధానాలను దాటవేస్తున్నారని సీబీఐ పేర్కొంటోందని, పంకజ్‌బన్సల్‌ కేసులో విస్తృత ధర్మాసనం తీర్పు ప్రకారం నిందితులు తమకు ఇష్టం వచ్చినట్లు సమాధానం చెప్పే హక్కు ఉందన్నారు.

అంతేకానీ దర్యాప్తు సంస్థలు కోరినట్లుగా సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. వాదనలను విన్న జడ్జి, కవితను ఈ నెల 23వరకు జ్యుడిషియల్‌ కస్టడీకి పంపుతున్నట్లు చెప్పారు. కవిత కోర్టు హాల్‌ నుంచి బయటికొస్తూ, బయట బీజేపీ (BJP Govt) వాళ్లు మాట్లాడిన విషయాలనే, లోపల సీబీఐవాళ్లు తనని అడుగుతున్నారంటూ వెళ్లిపోయారు.

Judge Serious on MLC Kavitha :కోర్టు ప్రాంగణంలో సోమవారం కవిత మీడియాతో మాట్లాడటంపై, ఆమె న్యాయవాది మోహిత్‌రావును జడ్జి కావేరి బవేజా ప్రశ్నించారు. ఆమె సొంతంగా మాట్లాడలేదని, మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం మాత్రమే ఇచ్చారని ఆయన చెప్పగా జడ్జి అందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె ఏం చెప్పాలనుకున్నా లిఖితపూర్వకంగా కోర్టుకు చెప్పాలి తప్పితే కోర్టు పరిధిలో ఇలా మాట్లాడటం మంచిదికాదని చెప్పారు. ఈ సూచనలను తాను కవిత దృష్టికి తీసుకెళ్తానని మోహిత్‌రావు న్యాయమూర్తికి విన్నవించారు.

సీబీఐ ప్రశ్నించడంపై కవిత పిటిషన్​ - తదుపరి విచారణ ఈ నెల 26కు వాయిదా - MLC Kavitha CBI Investigation

ABOUT THE AUTHOR

...view details