MLA Kondababu Comments on Dwarampudi: ద్వారంపూడి వైఖరితో కాకినాడ పోర్టు ప్రమాదంలో పడిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. కాకినాడ పోర్టు భూములు 331 ఎకరాలు తాకట్టు పెట్టారని, పోర్టులో అక్రమాలపై న్యాయ విచారణ చేయిస్తామన్నారు. ఆక్రమించిన పోర్టు భూములు వెంటనే అధికారులు స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు.
కాకినాడ పోర్టులో గత ఐదేళ్లలో భారీ కుంభకోణం జరిగిందని ఎమ్మెల్యే కొండబాబు ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కోట్లు రూపాయలు దోచుకున్నారని కొండబాబు తెలిపారు. ద్వారంపూడి అనుచరుడు ఆలీషా ఆరు వేల చదరపు గజాలు ్వేర్ యార్డ్ భూములు ఆక్రమించారన్నారు. పోర్టు అధికారులు నోటీసులు ఇచ్చినా ద్వారంపూడి అండదండలతో పట్టించుకోలేదన్నారు. కాకినాడ పోర్టులో పన్నులు వసూలు చేస్తున్నా, లాంచిలకు, పోర్టు కార్మికులకు ఎటువంటి సదుపాయాలు కల్పించడం లేదని మండిపడ్డారు.