MLA Balakrishna in Bhumi Puja For The Electricity Substation in Hindupur : శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటించారు. ఇందులో భాగంగా మూడోరోజు హిందూపురం రూరల్ గొల్లపురంగ్రామంలో రూ.3.48 కోట్లతో నిర్మించనున్న విద్యుత్ సబ్‌స్టేషన్‌కు ఆయన భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
హిందూపురం నియోజకవర్గంలో విద్యుత్ సమస్య లేకుండా తగినన్ని సబ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నివాస ప్రాంతాల ప్రజలతోపాటు రైతులు, పరిశ్రమలకు తగినంత విద్యుత్ సరఫరా చేయడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. హిందూపురం నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు.
Balakrishna Third Day Hindupur Constituency Visit :నియోజకవర్గంలో విద్యుత్ సమస్య లేకుండా ఆయా ప్రాంతాలలో సబ్‌స్టేషన్ నిర్మిస్తామన్నారు. ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలు తీసుకొస్తోందని, వాటికి అనుగుణంగానే ఇళ్లకు, పరిశ్రమలకు రైతులకు సబ్సిడీలు అందుతాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హిందూపురం నియోజకవర్గం భవిష్యత్తులో మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. హిందూపురం అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజ్ కింద సీఎం నారా చంద్రబాబు నాయుడు నిధులు మంజూరు చేయడానికి కృషి చేస్తున్నామన్నారు.