తెలంగాణ

telangana

ETV Bharat / state

భాగ్యనగరంలో చాపకింద నీరులా విస్తరిస్తోన్న డ్రగ్స్​ మహమ్మారి - యువతను దాటి మైనర్ల వరకు! - drugs in hyderabad

Minors Drugs Use Increase in Hyderabad : డ్రగ్స్​ మహమ్మారి హైదరాబాద్​ మహానగరంలో చాపకింద నీరులా విస్తరిస్తూపోతుంది. దీని బారిన యువతే కాదు, మైనర్లు కూడా పడుతున్నారు. ఇప్పుడు భాగ్యనగరంలో మైనర్లు ఎక్కువగా డ్రగ్స్​ సేవిస్తూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

Minors Drugs Use Increase
Minors Drugs Use Increase in Hyderabad

By ETV Bharat Telangana Team

Published : Feb 12, 2024, 7:05 AM IST

భాగ్యనగరాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్​ మహమ్మారి - ఈ వలలో చిక్కుకుంటున్న మైనర్లు

Minors Drugs Use Increase in Hyderabad : డ్రగ్స్​. హైదరాబాద్​ మహానగరాన్ని పట్టి పీడిస్తున్న అంశాల్లో ప్రధానమైనది. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా చాపకింద నీరులాగా విస్తరిస్తూ విస్తుపోయేలా చేస్తోంది. యువతలో మాదక ద్రవ్య వినియోగం పెరిగిపోవడమే కాదు, మైనర్ల వద్దకూ చేరి ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్​ నగరంలో 2023 జూన్​ 1 నుంచి డిసెంబరు 31 వరకు కేవలం గంజాయి(Ganja)కి సంబంధించి 30 కేసుల్లో 84 మంది మాత్రమే అరెస్టు అయ్యారు. అందులో భాగంగా దాదాపు రూ.4.13 కోట్ల విలువ చేసే 19,035 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మాదక ద్రవ్యాలకు సంబంధించి మొత్తం 182 మందిని అరెస్టు చేసినట్లు ఎన్​సీఆర్​బీ(NCRB) నివేదిక స్పష్టం చేస్తుంది. మరి వీటికి కారణాలు అనేకం కనిపిస్తున్నాయి. పెంపకంలో లోపాలు, సమ వయస్కుల ఒత్తిడి వల్ల మైనర్లు కూడా సిగరెట్లు సహా మాదక ద్రవ్యాల వినియోగానికి పాల్పడుతున్నారని మానసిక వైద్య నిపుణులు అంటున్నారు.

మాదక ద్రవ్యాలు, ఈ- సిగరేట్(E-Cigarette)​ వినియోగానికి సంబంధించి 2022లో 2,498 కేసులు మైనర్లపై నమోదయ్యాయని అధికారులు చెబుతున్నారు. అది 2023లో 28 శాతం పెరిగినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నగరంలో మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనార్థాలపై టీఎస్​ న్యాబ్​ గత నెల జనవరి 28న అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 203 కళాశాలల్లో యాంటీ డ్రగ్స్​ కమిటీలను ఏర్పాటు చేసింది.

శంషాబాద్​ విమానాశ్రయంలో మహిళా ప్రయాణికురాలి నుంచి భారీగా హెరాయిన్​ పట్టివేత - విలువ తెలిస్తే షాక్!

"20 ఏళ్ల లోపు పిల్లలు డ్రగ్స్​కు ఎక్కువగా బానిస అవుతున్నారు. ఈ డ్రగ్స్​ వాడకం వీరిపై ఎలాంటి దుష్ప్రభావం చూపుతుందంటే ఈ-సిగరెట్​ వల్ల ముఖ్యంగా ఊపిరితిత్తుల్లో ఇన్​ఫెక్షన్​ రావడం జరుగుతుంది. శరీరంలో రక్తనాళాలు ముడుచుకుపోవడం వల్ల రక్త ప్రసరణ తగ్గిపోయి పిల్లల పెరుగుదల తగ్గిపోతుంది. ఈ డ్రగ్స్​ వల్ల శరీరంలోని ఏ ఒక్క అవయవం దెబ్బ తిన్నా. దాంతో అనేక అవయవాలు దెబ్బ తినడానికి ఆస్కారం ఉంది. పిల్లలు చిన్న విషయానికే ఎక్కువగా రియాక్ట్ అవ్వడం వంటివి జరుగుతాయి."- డా. డి.వెంకటేశ్వర్లు, ఎండీ, సీనియర్‌ ఫిజీషియన్

Drugs Cases in Hyderabad : మరోవైపు డ్రగ్స్(Drugs)​ వినియోగదారుల్లో 536 మందిని రీహాబిటేషన్​ సెంటర్లకు పంపించినట్లుగా అధికాకులు వెల్లడించారు. అయితే వాటి వాడకం వల్ల మెదడు చురుకుదనం తగ్గడం, శారీరకంగా క్షీణించిపోవడం, ప్రాణాంతకానికి సైతం దారి తీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రులు నిత్యం పిల్లల కదలికలపై దృష్టి సారించడం, మాదకద్రవ్యాల వల్ల కలిగే పర్యవసానాలను పిల్లలకు అర్థమయ్యేలా వివరించాలని వైద్యులు, పోలీసులు సూచిస్తున్నారు. సమవయస్కుల కంటే ఎక్కువ తల్లిదండ్రులతో ఇలాంటి విషయాలు పంచుకోవాలని మైనర్లకు సూచిస్తున్నారు.

డ్రగ్స్​ ఒక్కసారి వినియోగిస్తే బానిసలుగా మారే అవకాశం : సందీప్ శాండిల్య

మరో నైజీరియన్ గ్యాంగ్ అరెస్ట్ - రూ.8కోట్లు విలువైన డ్రగ్స్ స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details