Minor Girl Rape Incident in NTR District :ఇంటర్ విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలంలోని ఒక గ్రామానికి చెందిన విద్యార్థిని(15) స్థానిక వసతి గృహంలో ఉంటూ ఓ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన తోట చందు (22) రెండు నెలలుగా ప్రేమించమని బాలిక వెంటపడుతున్నాడు. అతనికి అదే గ్రామానికి చెందిన ఇద్దరు మైనర్లు సహకరిస్తూ చందును ప్రేమించమని బాలికపై ఒత్తిడి చేయసాగారు.
భర్తకు మద్యం తాగించి- వివాహితపై సామూహిక అత్యాచారం - Woman Gang Raped
జ్వరంతో బాధ పడుతున్న బాలిక ఇంటి వద్ద నుంచి కళాశాలకు రాకపోకలు సాగిస్తుంది. ఈ నెల 10న ఆర్టీసీ బస్సులో వస్తుండగా చందు బాలికను బస్సులో నుంచి దించాడు. తన మిత్రులతో కలిసి బాలికను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని ఓ భవనంలోకి తీసుకెళ్లి బాలిక వద్దని వారిస్తున్నా అత్యాచారం చేశాడు. తిరిగి ముగ్గురు ఓ ప్రదేశానికి చేరుకుని, ఒక మైనర్‌ను దించి, మిగిలిన ఇద్దరు అదే బైక్‌పై బాలికను తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మర్లపాడు, వేంసూరు వైపు తీసుకెళ్లారు.