ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరద బాధితులకు మంత్రుల భరోసా- సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు ఆరా - MINISTERs REVIEW ON FLOODS - MINISTERS REVIEW ON FLOODS

Ministers Review on Heavy Floods in Andhra Pradesh : రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో మంత్రులు వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. వరద ప్రభావ ప్రాంతాల పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు ఆరా తీసున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి నీటి ప్రవాహలపై అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రభుత్వం జారీ చేసే సూచనలు హెచ్చరికలు పాటించి ప్రజలు సురక్షితంగా ఉండాలని మంత్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.

MINISTERS REVIEW ON FLOODS
వరద బాధితులకు మంత్రుల భరోసా- సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు ఆరా (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 2, 2024, 2:37 PM IST

Ministers Review on Heavy Floods in Andhra Pradesh : భారీ వర్షాల కారణంగా పలుచోట్ల కరకట్టలు దెబ్బతిన్నాయని మంత్రి అనగాని సత్యప్రసాద్​ తెలిపారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన చోట్ల కరకట్ట పనులను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కరకట్టలు బలహీనంగా ఉన్నచోట్ల కట్ట పటిష్టంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కట్ట కింద ఉండే గ్రామాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలోని కరకట్టల పటిష్టతపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంతో ఇప్పుడు మరింత ప్రమాదం ఏర్పడిందని మండిపడ్డారు.

సాధారణ పరిస్థితి వచ్చే వరకూ ఎన్టీఆర్​ జిల్లా కలెక్టరేట్‌లోనే ఉంటా:చంద్రబాబు - Chandrababu Inspected Flood Areas

Minister Nimmala Ramanaidu : బుడమేరు వరదపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయని పేర్కొన్నారు. గండ్లకు కొట్టుకుపోయిన వంతెనకు రాత్రంతా పనిచేసి అప్రోచ్​ పూర్తి చేశామని వెల్లడించారు. మధ్యాహ్నంలోపు కృష్ణానది వరద ప్రవాహం తగ్గే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రకాశం బ్యారేజీ మరమ్మతులకు జలవనరులశాఖ మెకానికల్ సలహాదారుడు కన్నయ్యనాయుడు సలహాలు తీసుకుంటున్నామని తెలియజేశారు. వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.

Minister Achenna Naidu :భారీ వరద దృష్ట్యా వ్యవసాయ అధికారులతో మంత్రి అచ్చెన్న నాయుడు అత్యవసర సమీక్ష నిర్వహించారు. కృష్ణానదీ పరివాహక ప్రాంతాల్లో వ్యవసాయ క్షేత్రాలకు రైతులెవరూ వెళ్లొద్దని సూచించారు. ప్రజలకు ఎలాంటి ప్రాణహాని లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వరద బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని పేర్కొన్నారు. ముంపు గ్రామాల ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పేర్కొన్నారు. ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యల్లో భాగంగా మత్స్యశాఖ నుంచి 109 బోట్లు తరలించినట్లు వెల్లడించారు.

రాష్ట్రం అతలాకుతలమైంది- అందరిని ఆదుకుంటాం- తప్పుడు ప్రచారాలపై చర్యలు : సీఎం - Chandrababu Review On Floods

Ministers Review :విజయవాడలో వరద దృష్ట్యా మంత్రులందరూ కలెక్టరేట్‌కు చేరుకుంటున్నారు. ఇప్పటికే మంత్రులు నారా లోకేశ్​, అచ్చెన్నాయుడు, కొలుసు పార్థసారథి విజయవాడ కలెక్టరేట్‌కు చేరుకున్నారు. సహాయక చర్యలపై మంత్రుల బృందాన్ని నారా లోకేశ్​ సమన్వయం చేస్తున్నారు. ఆర్​టీజీఎస్​ ద్వారా వచ్చే సమాచారంతో క్షేత్రస్థాయికి బృందాలను పురమాయిస్తున్నారు. అధికారుల నుంచి వివరాలు తెలుసుకుని మంత్రులకు లోకేశ్​ దిశానిర్దేశం చేస్తున్నారు.

Minister Gottipati Ravikumar : బాపట్ల జిల్లాలో ప్రాథమిక అంచనా ప్రకారం దాదాపు 90 వేల ఎకరాలు నీట మునిగిపోయాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్​ వెల్లడించారు. ప్రకాశం బ్యారేజీ నుంచి ఇప్పటికే 11.40 లక్షల క్యూసెక్యుల నీరు దిగువకు విడదల అయినట్లు పేర్కొన్నారు. దీంతో పంట నష్ట తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉందని భావించారు. వరద దృష్ట్యా లంక గ్రామవాసులు అధికార యంత్రానికి సహకరించి పునరావాస కేంద్రాలకు వెళ్లాలని ప్రజలకు గొట్టిపాటి ప్రజలకు విజ్ఞప్తి చేసుకున్నారు.

ఏపీలో భారీ వర్షాలు - సహాయక చర్యలపై చంద్రబాబు సమీక్ష - CM Chandrababu Review On Rains

Minister Kolusu Parthasarathy : వరద బాధితులను ప్రమాద పరిస్థితుల నుంచి తప్పించేందుకు సీఎం చంద్రబాబు ఎంతో శ్రమిస్తున్నారని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో కాలువ మరమ్మత్తుల పనులను నిర్లక్ష్యం చేయడం వల్లనే ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని ఆరోపించారు. వరదల్లో చిక్కుకున్న వారిని డ్రోన్లు సహాయంతో గుర్తించి రక్షిస్తున్నామని తెలియజేశారు. ముంపు ప్రాంతవాసులకు ఆహార పదార్థాలు, మందులను అందించడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుందని తెలియజేశారు.

అత్యవసరమైతేనే బయటకు రండి - ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని మంత్రులు సూచనలు - Heavy Rains in aP

ABOUT THE AUTHOR

...view details