Minister Sridhar Babu fires on BJP :పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే గడ్డం వంశీకృష్ణను ప్రజలు గెలిపించాలని, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) కోరారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈరోజు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్దపల్లి నుంచి గెలిచిన ఎంపీలు ప్రజా సమస్యలను ఏనాడు పట్టించుకోలేదని దుయ్యబట్టారు.
Lok Sabha Elections 2024 : ముఖ్యంగా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఎక్కువ శాతం ఉన్న రైతుల సమస్యలను, అటు బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడంతో రైతులు ఆత్మహత్య చేసుకున్నారని శ్రీధర్‌బాబు మండిపడ్డారు. కేంద్రప్రభుత్వం, రైతులు పండించిన పంటలకు మద్ధతు ధరను ప్రకటించడంలో విఫలమైందని దుయ్యబట్టారు. పెట్రోల్, డీజిల్ ధరలను అధికంగా పెంచారన్నారు.
త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్(Congress) ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, తమ తమ ప్రాంతాలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. పెద్దపల్లి ఎంపీగా పోటీ చేస్తున్న గడ్డం వంశీకృష్ణకు రాజకీయం అవగాహన ఉందని, గతంలో గతంలో తన తాత గడ్డం వెంకటస్వామి, తరువాత తన తండ్రి గడ్డం వివేక్ ఎంపీగా పనిచేసిన అనుభవం ఉండడం వల్ల అభివృద్ధి జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.