ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"రాష్ట్రానికి రెండో రాజధానిగా ఆ నగరాన్ని అభివృద్ధి చేస్తాం"

వరంగల్‌ను రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామన్న తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి - కేంద్రం అనుమతిస్తే మామునూరు విమానాశ్రయాన్ని అందుబాటులోకి తెస్తామని స్పష్టం

Will Develop Warangal As Second Capital Of Telangana
Will Develop Warangal As Second Capital Of Telangana (ETV BHarat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 3, 2024, 10:10 PM IST

Will Develop Warangal As Second Capital Of Telangana : భద్రకాళి అమ్మవారి దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఆ రాష్ట్రంలోని వరంగల్‌ జిల్లాలో భద్రకాళి అమ్మవారిని నేడు దర్శించుకున్నారు. ముందుగా ఆలయానికి వచ్చిన మంత్రికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న మంత్రి శ్రీనివాస్ రెడ్డి, మాడవీధుల అభివృద్ధి పనులపై కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

రెండో రాజధానిగా వరంగల్‌ అభివృద్ధి : ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. వరంగల్‌ను రాష్ట్రానికి రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామంటూ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే మామునూరు విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు. మరో వైపు నగరంలోని పలు అభివృద్ధి పనుల పురోగతిని ఆయన పరిశీలించారు. త్వరలోనే నగరంలోని కాళోజీ కళా క్షేత్రాన్ని ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి పనులను సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు వివరించారు. సీఎం వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని వివరించారు.

జనవరి నుంచి రాజధాని పనులు - డిజైన్లలో నో ఛేెంజ్​: మంత్రి నారాయణ

"వరంగల్ నగరాన్ని రాష్ట్ర రెండో రాజధానిగా అభివృద్ధి చేసే దానిలో భాగంగా భద్రకాళి టెంపుల్​కు సంబంధించిన మాఢవీధులు, ఆలయానికి ఆనుకుని ఉన్న లేక్​ను డెవలప్​ చేసేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంతేకాకుండా పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి త్వరలోనే శంకుస్థాపన చేయనున్నారు. భద్రకాళి జలాశయాన్ని పూర్తిస్థాయిలో తాగునీటి జలాశయంగా మారుస్తాం. త్వరలో సర్వే నిర్వహించి, భద్రకాళి జలాశయం ఆక్రమణలు తొలగిస్తాం. అలానే వరంగల్​ నగరవాసులకే కాకుండా జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలందరికీ కూడా ఉపయోగకరమైన ఒక మంచి విమానాశ్రయాన్ని కూడా ఈ ప్రభుత్వం ఇవ్వబోతోంది." - పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తెలంగాణ రెవెన్యూశాఖ మంత్రి

అధికారుల తీరుపై ఆగ్రహం :ఆలయ మాఢవీధులను త్వరితగతిన పూర్తి చేస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. అదే విధంగా ఇక్కడి జలాశయాన్ని తాగునీటి జలాశయంగా మారుస్తామని చెప్పారు. భద్రకాళి చెరువు కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఘాటుగా హెచ్చరించారు. సర్వే చేయించి అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని మంత్రి చెప్పారు. మరోవైపు జలాశయానికి సంబంధించిన వివరాలను అధికారులను అడగగా సరిగా స్పందించకపోవడంతో అధికారుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక జెట్ స్పీడ్​లో అమరావతి పనులు - రాజధాని నిర్మాణానికి రూ.11 వేల కోట్లు

రాజధాని అమరావతికిచ్చే రూ.15 వేల కోట్లు గ్రాంటే!

ABOUT THE AUTHOR

...view details