ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నైపుణ్య గణనకు ఏర్పాట్లు చేయండి' - అధికారులకు మంత్రి లోకేశ్ ఆదేశం - Minister Lokesh on Skill Census - MINISTER LOKESH ON SKILL CENSUS

Minister Lokesh on Skill Census: నైపుణ్య గణనపై అధికారులతో మంత్రి నారా లోకేశ్ సమీక్షించారు. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకే దేశంలోనే తొలిసారిగా నైపుణ్య గణన చేపడుతున్నామని తెలిపారు. నైపుణ్య గణనను అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని లోకేశ్ ఆదేశించారు.

Minister Lokesh on Skill Census
Minister Lokesh on Skill Census (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 8, 2024, 8:56 PM IST

Minister Lokesh on Skill Census: యువతలో నైపుణ్యాలను గుర్తించి వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపర్చే లక్ష్యంతో దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో నైపుణ్య గణన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న స్కిల్ సెన్సెస్ విధివిధానాల రూపకల్పనపై స్కిల్ డెవలప్​మెంట్ అధికారులతో ఆయన సమీక్షించారు. స్కిల్ సెన్సెస్ పూర్తిచేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు.

ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరణ: నిర్దేశిత సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఆన్​లైన్ విధానంలో స్కిల్ సెన్సస్ వివరాలు సేకరిస్తారని అధికారులు తెలిపారు. స్కిల్ సెన్సెస్​లో భాగంగా వివరాలను సేకరించి, వారిలో నైపుణ్యాభివృద్ధికి చర్యలు తీసుకోవడం, ఉపాధి అవకాశాలు కల్పించడం, తద్వారా వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చడడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని లోకేశ్ స్పష్టం చేశారు. తొలుత ఒక నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్​గా చేపట్టి, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దీనిని చేపట్టేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. మరింత మెరుగైన ఫలితాల కోసం అవసరాన్ని బట్టి ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్​ను కూడా ఉపయోగించాలన్నారు.

మరుగుదొడ్ల ఫొటోలు తీయాల్సిన అవసరం లేదు - నాణ్యమైన విద్య పిల్లలకు అందించండి: మంత్రి లోకేశ్ - Lokesh on Teachers Problems

ఆన్​లైన్ ద్వారా నమోదు చేసుకునేలా ఏర్పాట్లు:స్కిల్ సెన్సెస్​లో భాగంగా ఆయారంగాల్లో ఆసక్తి ఉన్న యువతను గుర్తించి శిక్షణ ఇచ్చాక, వారికి ప్రఖ్యాత సంస్థలతో సర్టిఫికెట్​ను కూడా అందజేస్తారన్నారు. రాష్ట్రంలోని పరిశ్రమలతో పాటు నౌకరీ డాట్ కామ్, లింక్‌డ్‌ ఇన్ వంటి పోర్టల్స్ ద్వారా మెరుగైన అవకాశాలను పొందడానికి ఈ సర్టిఫికేషన్ ఉపయోగపడుతుందని తెలిపారు. స్థానికంగా అందుబాటులో లేకపోయినప్పటికీ ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో విద్యను అభ్యసిస్తున్న యువతీ యువకులు కూడా ఆన్​లైన్ ద్వారా స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

యువతలో నైపుణ్యాలను డిజిటలైజ్ చేసి అవకాశాలను మెరుగుపర్చడమే స్కిల్ సెన్సెస్ లక్ష్యమని వివరించారు. ఇందులో భాగంగా ఎన్యుమరేటర్లకు శిక్షణ ఇవ్వాలని, యువతను చైతన్యవంతం చేయాలని సూచించారు. సర్వే అంశాలు సాధ్యమైనంత సులభంగా ఉండేలా చూడాలన్నారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో జరిగే సమావేశంలో విధివిధానాలు ఖరారు చేయాలని సమావేశంలో నిర్ణయించారు.

'మమ్మల్ని మన్నించండి కామ్రేడ్' - పోలీసుల అత్యుత్సాహంపై 'ఎక్స్'​లో లోకేశ్ పోస్ట్​ - nara Lokesh Fire On Police Behavior

Minister Lokesh Review On IT Industries: రాష్ట్రంలో ఐటీ అభివృద్థి, పరిశ్రమల స్థాపన కోసం దేశంలోని టాప్-10 పారిశ్రామికవేత్తలతో చర్చించనున్నట్లు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ఉండవల్లిలోని నివాసంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. పెట్టుబడిదారులను ఆకర్షించడం, మౌలిక సౌకర్యాల కల్పనపై అధికారులతో చర్చించారు. రియల్ టైం గవర్నెన్స్​ను(ఆర్టీజీఎస్) మరింత మెరుగ్గా రూపుదిద్దాలని మంత్రి సూచించారు.

తిరుపతి పరిసర ప్రాతాల్లో ఎలక్ట్రానిక్ క్లస్టర్లను అభివృద్ధి చేయడంతో పాటు విడిభాగాలు తయారుచేసే యూనిట్స్​ను నెలకొల్పేందుకు కృషిచేయాలన్నారు. ఇన్నోవేషన్ సెంటర్స్​లో ప్రోత్సాహకాలు అందించి స్టార్టప్​లకు అవసరసమైన ఎకో సిస్టమ్​ను మరింత మెరుగుపరచాలని దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఐటీ సెక్రటరీ సౌరభ్ గౌర్, ఎండీ ఏపీటీఎస్ రమణారెడ్డి, కమ్యూనికేషన్స్ డైరెక్టర్ డి.వెంకటాచలం, ఐటీ జాయింట్ సెక్రటరీ సూర్జిత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

లోకేశ్​ క్షమాపణలు- మంచి సంప్రదాయాలకు తెరతీశారంటూ బీజేపీ నేత ప్రశంసంలు - BJP Leader Congratulate To Lokesh

Lokesh Condolence to RammohanRao Death: మాజీ ఎంపీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కెంబూరి రామ్మోహన్ రావు ఆకస్మిక మరణంపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ సంతాపం తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పుర్లి గ్రామంలో జన్మించిన ఆయన బొబ్బిలి పార్లమెంటు స్థానం నుంచి 1989లో ఎంపీగా విజయం సాధించి పార్టీకి, ఉత్తరాంధ్ర ప్రజలకు ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. అంతకుముందు ఆయన చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించారని గుర్తుచేశారు. పార్టీకి అంకితభావంతో పని చేసిన ఆయన లేని లోటు తీర్చలేనిదన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆకాంక్షించారు. రామ్మోహన్‌రావు కుటుంబసభ్యులకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామ్మోహన్ రావు ఎమ్మెల్యేగా, ఎంపీగా ప్రజలకు ఎనలేని సేవలు అందించారని లోకేశ్ తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు లోకేశ్ సానుభూతి తెలిపారు.

అకడమిక్ క్యాలెండర్ విడుదల చేసిన మంత్రి నారా లోకేశ్ - Lokesh Released Academic Calendar

ABOUT THE AUTHOR

...view details