Nara Lokesh on Sikh Family Complaint: శ్రీకాకుళం జిల్లా కంచిలిలో తమ పూర్వీకుల భూమిని వైఎస్సార్సీపీ హయాంలో కొందరు అక్రమంగా రిజస్టర్ చేసుకున్నారని ఓ సిక్కు కుటుంబం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో మంత్రి లోకేశ్‌కు ఫిర్యాదు చేశారు. గతంలో అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని, మైనార్టీలకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
భూ అక్రమాలపై ఓ కుటుంబం ఫిర్యాదు - 'ఎక్స్'లో స్పందించిన లోకేశ్ - LOKESH ON SIKH FAMILY COMPLAINT
'ఎక్స్'లో మంత్రి నారా లోకేశ్‌కు ఫిర్యాదు - తక్షణమే సమస్య పరిష్కరించాలని ఆదేశం

By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 11, 2024, 4:19 PM IST
బాధితుల ఫిర్యాదుపై స్పందించిన లోకేశ్, తక్షణమే చర్యలు తీసుకొని సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఏపీ అందరిదీ అని, కులమత వివక్షకు భయపడకుండా అర్హులైన ప్రతి ఒక్కరూ ఇక్కడ జీవించవచ్చని లోకేశ్ పేర్కొన్నారు. మీ ఆస్తిని మీరు అనుభవించడానికి సురక్షితమైన, చట్టబద్ధమైన వాతావరణంలో గడపడానికి మీకు హక్కు ఉందని లోకేశ్ తెలిపారు. ఫిర్యాదు చేసిన హర్జీవ్ సింగ్ కుటుంబం ప్రస్తుతం చండీగఢ్‌లో నివాసం ఉంటున్నారు.
"చాలా పెద్ద తప్పు చేశావు తమ్ముడు, ఐ మిస్ యూ" - లోకేశ్ ఎమోషనల్ ట్వీట్