ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుజరాత్​లో 5 టన్నుల ఎర్రచందనం స్వాధీనం - మంత్రి లోకేశ్ ఏమన్నారంటే - RED SANDALWOOD SEIZED

5 టన్నుల ఎర్రచందనం దుంగలు స్వాధీనం - స్వాధీనం చేసుకున్న ఎర్రచందనాన్నీ తిరుపతికి తరలిస్తామని వెల్లడించిన ఏపీ టాస్క్‌ఫోర్స్‌ డీఎస్పీ షరీఫ్ - RSASTF టీమ్​ని అభినందించిన మంత్రి లోకేశ్

red_sandalwood
RED SANDALWOOD SEIZED IN GUJARAT (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 14, 2024, 11:07 AM IST

RED SANDALWOOD SEIZED IN GUJARAT : గుజరాత్​లోని పాటన్​లో 5 టన్నుల బరువు ఉన్న 155 ఎర్రచందనం దుంగల్ని ఏపీ రెడ్ సాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ పట్టుకున్నారు. స్థానిక గుజరాత్ పోలీసుల సాయంతో ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. స్మగ్లర్​ల నుంచి స్వాధీనం చేసుకున్న ఎర్ర చందనం దుంగలు అంతర్జాతీయ మార్కెట్​లో 10 కోట్ల రూపాయల విలువ చేస్తాయని స్పష్టం చేశారు.

స్మగ్లర్ల నుంచి ఒక బ్రెజ్జా కారు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అరెస్టు చేసిన స్మగ్లర్లను గుజరాత్​లోని స్థానిక పాటన్ కోర్టులో ప్రవేశ పెట్టి ట్రాన్సిట్ వారంట్​పై ఆంధ్రప్రదేశ్ తరలిస్తామని టాస్క్ ఫోర్సు డీఎస్పీ షరీఫ్ వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న ఎర్ర చందనం దుంగలు కూడా తిరుపతికి తరలిస్తామని స్పష్టం చేశారు.

Minister Nara Lokesh on Red Sanders : ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకోవడంపై మంత్రి నారా లోకేశ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పంచించారు. గత ప్రభుత్వం హయాంలో మన అమూల్యమైన సహజ సంపదను రాష్ట్రం నుంచి తరలించేందుకు ఎర్రచందనం స్మగ్లర్లకు రెడ్ కార్పెట్ స్వాగతం పలికిన సందర్భాలు ఉన్నాయని అన్నారు.

ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రంలో స్మగ్లింగ్ అసాధ్యంగా మారడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రెడ్‌ సాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ (AP RSASTF) బృందం గుజరాత్‌లోని పటాన్ వరకు వెళ్లి పేరుమోసిన స్మగ్లర్లను పట్టుకుని 5 టన్నులు స్వాధీనం చేసుకుందని కొనియాడారు. మన సహజ సంపదను కాపాడుకోవడంలో కృషి చేసిన ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్, RSASTF టీమ్​ని అభినందించారు.

ఎర్రచందనం అక్రమాలపై డ్రోన్లతో నిఘా - స్మగ్లర్లకు సహకరిస్తే పీడీ యాక్ట్

చెన్నై టూ అస్సాం - మంగళగిరిలో భారీగా ఎర్రచందనం స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details