Lokesh Inquire about Ill Health of Students in Nuziveedu IIIT : నూజివీడు ట్రిపుల్ ఐటిలో విద్యార్థుల అస్వస్థతపై మంత్రి లోకేశ్ ఆరా తీశారు. ట్రిపుల్ ఐటీ డైరక్టర్‌ను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే ముగ్గురు సభ్యులతో కూడిన పర్యవేక్షక కమిటీ ఏర్పాటు చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నమ్మకం పెంపొందించేలా చర్యలు చేపట్టాలని కోరారు. అదేవిధంగా ఆహార నాణ్యత, మరమ్మతుల అంశాలపై ప్రణాళిక వేయాలని సూచించారు. ఇకపై అవాంఛనీయ సంఘటనలు జరిగితే ప్రభుత్వం దృష్టికి తేవాలని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.
నూజివీడు ట్రిపుల్ ఐటి ఘటనపై మంత్రి లోకేశ్ ఫైర్ - డైరెక్టర్ తొలగింపు - Lokesh on Nuziveedu IIIT issue - LOKESH ON NUZIVEEDU IIIT ISSUE
Lokesh Inquire about Ill Health of Students in Nuziveedu IIIT : నూజివీడు ట్రిపుల్ ఐటిలో విద్యార్థుల అస్వస్థతపై మంత్రి లోకేశ్ ఆరా తీశారు. ట్రిపుల్ ఐటీ డైరక్టర్‌ను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే ముగ్గురు సభ్యులతో కూడిన పర్యవేక్షక కమిటీ ఏర్పాటు చేశారు. ఇకపై అవాంఛనీయ సంఘటనలు జరిగితే ప్రభుత్వం దృష్టికి తేవాలని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.

By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 31, 2024, 9:42 PM IST
అయితే నూజివీడు ట్రిపుల్ ఐటీలో వందల మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 1,194 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో బుధవారం మంత్రి పార్ధసారథి ట్రిపుల్ ఐటీలో పర్యటించి మెస్‌ను పరిశీలించారు. విద్యార్థులు, అధికారులతో సమావేశమైన మంత్రి, మెస్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అనేక మంది అధికారులు మెస్‌లో ఆహార నాణ్యతను పరిశీలించారు. అయినప్పటికి మెస్ నిర్వాహకులు తీరు మాత్రం మరలేదు. ప్రస్తుతం మంత్రి లోకేశ్ విద్యార్థుల అస్వస్థతపై ఆరా తీస్తుడంటం సర్వత్ర ఆసక్తి నెలకొంది.