ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉపాధి పనుల్లోనూ దోచేశారు - గత ఐదేళ్లలో రూ.856 కోట్లు గోల్‌మాల్‌ - MGNREGAS FUNDS SCAM IN YSRCP GOVT

ఉపాధి పనుల్లో ఐదేళ్లలో రూ.856 కోట్ల గోల్‌మాల్‌ - వైఎస్సార్సీపీ నేతలతో కుమ్మక్కైన అధికారులు, సిబ్బంది - సామాజిక తనిఖీల్లో వెలుగులోకి అవినీతి బాగోతం

MGNREGAS_FUNDS_SCAM_IN_YSRCP_GOVT
MGNREGAS_FUNDS_SCAM_IN_YSRCP_GOVT (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 19, 2025, 9:53 AM IST

MGNREGS Funds Misuse in YSRCP Govt:గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో ఉపాధి పనుల్లో పందికొక్కులు దూరాయి. వైఎస్సార్సీపీ నేతలతో కుమ్మక్కైన అధికారులు, సిబ్బంది దొంగ మస్టర్లు, బోగస్‌ పనులతో దోపిడీకి పాల్పడ్డారు. ఐదేళ్లలో రూ.856 కోట్ల 66 లక్షల నిధులు గోల్‌మాల్‌ అయ్యాయి. సామాజిక తనిఖీలు, విచారణలతో ఈ అక్రమాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. నిధుల దుర్వినియోగాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

గత ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకం అమలుకు సంబంధించిన కీలక స్థానాలను అప్పటి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన అనుకూల అధికారులతో నింపేశారు. తరువాత పెద్దిరెడ్డి స్థానంలో బూడి ముత్యాలనాయుడు వచ్చినా అధికారులెవరూ కదల్లేదు. జిల్లా స్థాయిలో ప్రాజెక్టు డైరెక్టర్లు కొందరు వైఎస్సార్సీపీ నేతలు చెప్పినదానికల్లా తలూపారు. దొంగ మస్టర్లు, బోగస్‌ పనులతో ఇష్టారాజ్యంగా ఉపాధి నిధులు దుర్వినియోగం చేశారు.

ఉపాధి పనుల్లోనూ దోచేశారు - గత ఐదేళ్లలో రూ.856 కోట్లు గోల్‌మాల్‌ (ETV Bharat)

2019-20లో 661 మండలాల్లో రూ.8,617 కోట్లతో పనులు చేపట్టారు. వీటిలో రూ.547 కోట్ల 20 లక్షల విలువైన పనులకు క్షేత్రస్థాయి సిబ్బంది వద్ద రికార్డులు కూడా లేవంటే నిధుల దుర్వినియోగం ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతోంది. రెండో దశ పరిశీలన తర్వాత రూ.410కోట్ల 98లక్షలు దుర్వినియోగమైనట్లు సామాజిక తనిఖీ బృందాలు నిర్ధారణకు వచ్చాయి.

'థర్డ్‌ క్లాస్‌ వ్యక్తులను ఇక్కడ పెట్టిందెవరు?' - టీటీడీ ఉద్యోగిపై బోర్డు సభ్యుడి బూతు పురాణం

కుమ్మక్కైన అధికారులు, సిబ్బంది: ఉపాధి పనులపై నిష్పక్షపాతంగా విచారించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలిచ్చే సామాజిక తనిఖీ విభాగాన్ని కూడా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టించింది. అనుకూలమైన అధికారిని ఈ విభాగాధిపతిగా నియమించింది. ఆయనపై ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా పట్టించుకోలేదు. దీంతో జిల్లా, మండల స్థాయిలోనూ సామాజిక తనిఖీ విభాగాలకు అవినీతి మకిలి అంటింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఏటా వందల కోట్ల నిధులు దుర్వినియోగమైనట్లు గుర్తించారంటే నిష్పక్షపాతంగా విచారణ చేస్తే ఇంకెన్ని కోట్లలో అవినీతి బయటపడుతుందో? కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక సామాజిక తనిఖీ విభాగాధిపతి నుంచి జిల్లా స్థాయి వరకు కీలక స్థానాల్లో ఉన్న వారిని తొలగించారు.

దొంగ మస్టర్లు, బోగస్‌ పనులతో కోట్లు దోపిడీ:క్షేత్రస్థాయిలో ఫీల్డ్‌ అసిస్టెంట్, టెక్నికల్‌ అసిస్టెంట్, ఏపీవో నుంచి ఎంపీడీవో వరకు గత ప్రభుత్వంలో అనేక జిల్లాల్లో కుమ్మక్కై ఉపాధి నిధులు దుర్వినియోగం చేశారు. దొంగ మస్టర్లు, బినామీ పనులు, చేసిన పనులే మళ్లీ చూపడం ద్వారా సొమ్ములు జేబుల్లో వేసుకునేవారు. గత ప్రభుత్వంలో జిల్లా స్థాయిలో ప్రాజెక్టు డైరెక్టర్లు కొందరు బరి తెగించారు. తమ పరిధిలోని మండలాల నుంచి ప్రతి నెలా ముడుపులు తీసుకుంటూ క్షేత్రస్థాయిలో ఎన్ని అక్రమాలు జరిగినా కళ్లుమూసుకున్నారు.

ఎంపీడీవోలు సహకరించకపోతే పీడీలు అక్కడికి వెళ్లి తనిఖీల పేరుతో హడావుడి చేసి దారికి తెచ్చుకునేవారు. రాష్ట్ర స్థాయి అధికారుల్లో కొందరికి జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లు ఎప్పటికప్పుడు కప్పం చెల్లించేవారు. ఓ అధికారి ముడుపుల వసూళ్ల కోసమే జిల్లా పర్యటనలకు వెళ్లేవారు. ఆయన వచ్చేసరికి పీడీలు కవర్లు సిద్ధం చేసేవారు. సహకరించని పీడీలపై ఉన్నతాధికారులకు చాడీలు చెప్పే పరిస్థితి ఉండేది.

'ప్రతిపక్షం పోటీలో లేదనే నిర్లక్ష్యం వద్దు' - ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ నేతలకు లోకేశ్ దిశానిర్దేశం

వైఎస్ జగన్ పోలీసులపై బెదిరింపు వ్యాఖ్యలు మానుకోవాలి:పోలీసు అధికారుల సంఘం

ABOUT THE AUTHOR

...view details