Mentally Disabled Woman Gave Birth To Baby Boy :ఏ ఇంటి ఆడబిడ్డో,ఎక్కడి నుంచి వచ్చిందో ఎవ్వరికి తెలియదు. 30 నుంచి 35 సంవత్సరాల మహిళ. మానసిక స్థితి సరిగా లేదు. 2 సంవత్సరాలుగా రాజమహేంద్రవరం గ్రామీణం శాటిలైట్‌సిటీలో ఓ ఆలయం వద్ద ఉంటూ యాచన చేసుకుంటుంది. స్థానిక ప్రజలు ఇచ్చిన ఆహారాన్ని తింటూ జీవనం సాగిస్తోంది. ఈ తరుణంలో ఆమె గర్భవతి అయ్యింది. తాను గర్భిణిని అన్న విషయం కూడా తెలుసుకోలేని స్థితి ఆమెది.
తల్లీ బిడ్డ క్షేమం - ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు : శుక్రవారం ఉదయం ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డతో ఆమె పరుగులు తీసింది. అది గమనించిన వారు ఎవరింటి శిశువునో పట్టుకొని పారిపోతున్నట్లుగా తొలుత భావించారు. అసలు విషయం తెలిసి జాలి పడ్డారు. అనంతరం ఆ శిశువును చేరదీసి పాలు పట్టారు. ఆదే గ్రామానికి చెందిన పలువురు ఆ బిడ్డను పెంచుకోడానికి పోటీ పడ్డారు.