Maridi killed in vadina At Padamata:వదిన అంటే తల్లితో సమానం అంటారు. అలాంటి వదిననే అతి కిరాతకంగా గొంతు కోసి తన మరిదే హతమార్చాడు. ఈ ఘటన విజయవాడలో అనూహ్యంగా చోటుచేసుకుంది. వదినను గొంతు కోసి చంపేసి అనంతరం మరిది గొంతు కోసుకుని చావు బతుకుల మధ్య ఉన్న ఘటన విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పద్మజా నగర్‌కు చెందిన బంగారు దుర్గ అనే మహిళ ఆరు సంవత్సరాలుగా భర్తకు దూరంగా ఉంటోంది. దుర్గకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెద్ద కుమార్తె సంతోషినికి వివాహం అయ్యింది. కుమారుడు బట్టల దుకాణంలో పని చేస్తున్నాడు. చిన్న కుమార్తె నాగలక్ష్మి గన్నవరంలో హాస్టల్లో ఉంటూ చదువుకుంటుంది. దుర్గ రైతు బజారు సమీపంలోని ఇండోర్ స్టేడియంలో స్వీపర్‌గా పని చేస్తోంది. దుర్గ తన చెల్లి భర్త హరికృష్ణతో సన్నిహితంగా ఉండేది.
రూ.500 కోసం గొడవ- ఫ్రెండ్ కన్ను పీకేసి గొంతు కోసి హత్య
Murder in Vijayawada: ఎన్ఎసీ కల్యాణ మండపం సమీపంలో ఉంటున్న హరికృష్ణ కూడా గత నాలుగు సంవత్సరాలుగా భార్యకు దూరంగా ఉంటున్నాడు. హరికృష్ణకు ఇద్దరు సంతానం. కుమారుడిని హాస్టల్లో, కుమార్తెను తన దగ్గరే ఉంచుకొని చదివిస్తున్నాడు. హరికృష్ణ స్వీపర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. హరికృష్ణతో దుర్గ సన్నిహితంగా మెలుగుతుందని ఆమె కుమారుడు అతడిపై దాడి చేశాడు. దుర్గ కుటుంబ సభ్యులు కూడా ఈ విషయంపై తరుచూ గొడవపడటంతో కొంతకాలం నుంచి ఆమె హరికృష్ణను దూరం పెట్టింది. దీంతో అతను దుర్గపై ద్వేషం పెంచుకున్నాడు.