Mangalagiri Premier League:రాబోయే ఎన్నికలను పురష్కరించుకుని రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్ల కోసం సమయత్తమవుతున్నాయి. ఈ క్రమంలో వైసీపీ ఎన్నికల నగరాను ఇప్పటికే పూరించగా, తెలుగుదేశం యువనేత లోకేశ్ కూడా ఎన్నికలకు సమర శంఖారావం పూరించేందుకు సిద్ధమవుతున్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపే ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తున్న ఆయన ప్రభుత్వ అరాచకాలు, అవినీతిని ఎండగడుతున్నారు.
టీడీపీ గెలుపుపై ధీమాగా ఉన్న లోకేశ్ తన నియోజకవర్గమైన మంగళగిరిలో తెలుగుదేశం మెజారిటీపై దృష్టి సారించారు. నియోజకవర్గంలోని ప్రతి ఊరు వీధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన స్థానిక టీడీపీ నేతలు లోకేశ్ జన్మదినం సందర్భంగా ఇటీవల భారీ క్రీడా సంబరానికి తెరదీశారు. మంగళగిరి ప్రీమియర్ లీగ్ పేరుతో భారీ స్థాయిలో క్రికెట్ పోటీలను నిర్వహించిన టీడీపీ శ్రేణులకు యువత నుంచి అనూహ్య స్పందన లభించింది. నియోజకవర్గంలో నిర్వహించిన మంగళగిరి ప్రీమియర్ లీగ్ 2లో పాల్గొన్న యువతను చూస్తుంటే, లోకేశ్‌కు నియోజకవర్గంలోని బలమెంటో తెలిసిపోతుందని తెలుగుదేశం నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
ఆ కసి నాలో ఉంది - రాష్ట్రమంతా మంగళగిరి వైపు చూసేలా చేస్తా : లోకేశ్
గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించిన మంగళగిరి ప్రీమియర్ లీగ్ 2 పోటీలు ఆదివారంతో ముగిశాయి. దాదాపు 100 జట్ల వరకు పోటీలో పాల్గొన్నాయి. ఈ క్రికెట్ పోటీల్లో భాగంగా ఆదివారం రోజున ఫైనల్ మ్యాచ్ నిర్వహించారు. ఫైనల్ మ్యాచ్‌లో వల్లభనేని వెంకట్రావ్ యూత్ టీమ్‌కు, దుగ్గిరాలకు చెందిన అన్‌స్టాపబుల్ జట్లకు మధ్య పోటీ నువ్వానేనా అనే స్థాయిలో జరిగింది.