Police Rejected Pinnelli Victim Zero FIR: పిన్నెల్లి బాధితుల విషయంలో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అయితే గుంటూరు జిల్లా మంగళగిరి గ్రామీణ పోలీసులు బాధితుడు నోముల మాణిక్యరావు చేసిన జీరో ఎఫ్ఐఆర్ ఫిర్యాదును తిరస్కరించారు.
దాదాపు మూడు గంటల పాటు మాణిక్యరావు, ఆయన తరఫు న్యాయవాది లక్ష్మణరావు, ఇద్దరు నేతలు పోలీస్ స్టేషన్లో వేచి ఉన్నారు. తమపై ఒత్తిడి ఉందని, ఫిర్యాదును పల్నాడు జిల్లాలో ఇవ్వాలంటూ ఎస్ఐ క్రాంతి కిరణ్ టీడీపీ నేతలకు చెప్పారు. అక్కడకు వెళ్లే పరిస్థితి లేకే మంగళగిరి పీఎస్‌కు వచ్చానని మాణిక్యరావు తెలిపారు. ఎస్సై వ్యవహరించిన తీరుపై రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేస్తామని న్యాయవాది లక్ష్మణరావు చెప్పారు. దీంతో డీజీపీ ఆదేశాల మేరకు జీరో ఎఫ్‌ఐఆర్‌ను పోలీసులు నమోదు చేశారు. మాణిక్యరావు ఫిర్యాదును మంగళగిరి గ్రామీణ పోలీసులు తీసుకున్నారు.
వైఎస్సార్సీపీ చేస్తున్న రిగ్గింగ్‌ను అడ్డుకోవడమే నేను చేసిన తప్పా: మాణిక్యరావు - Manikya Rao on Pinnelli brothers
కాగా పోలింగ్ రోజు మాణిక్యరావు, అతడి కుటుంబసభ్యులపై దాడి జరిగింది. ఎన్నికల సమయంలో టీడీపీ పోలింగ్ ఏజెంట్‌గా మాణిక్యరావుపై కూర్చున్న సమయంలో పిన్నెల్లి అనుచరులు దాడి చేశారు. మరోవైపు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిపై మాణిక్యరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి తనను దుర్భాషలాడారని మాణిక్యరావు ఆరోపించారు. పోలింగ్ కేంద్రంలోనే పిన్నెల్లి అనుచరులు తనపై దాడి చేశారని తెలిపారు. టీడీపీ ఏజెంట్‌గా కూర్చునే ధైర్యం ఎవరిచ్చారంటూ దాడి చేశారని, పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి తన కుటుంబం పైనా దాడి చేసినట్లు మాణిక్యరావు పేర్కొన్నారు. పిన్నెల్లి అనుచరులు తన పెద్దకుమారుడి పొట్టపై తన్నారని, ప్రాణాలకు తెగించి టీడీపీ తరఫున పోలింగ్ ఏజెంట్‌గా కూర్చున్నానని అన్నారు.
వెంకట్రామిరెడ్డి కాళ్లు పట్టుకుని తమ వదిన బ్రతిమాలినా వదల్లేదని మాణిక్యరావు ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబంపై ఆయనకు అంత కక్ష ఎందుకని ప్రశ్నించారు. పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి భయపడి అధికారులు నోరు మెదపలేదని, తనపై దాడి చేస్తున్నా పోలీసులు స్పందించలేదని తెలిపారు. డీఎస్పీ ఉండగానే తనపై దాడికి యత్నించారని తెలిపారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని డీఎస్పీని సైతం బెదిరించారని పిన్నెల్లి సోదరుల కంటే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ చాలా బెటర్ అని విమర్శించారు. తనను చంపేంత తప్పు ఏం చేశానని, వైఎస్సార్సీపీ చేస్తున్న రిగ్గింగ్‌ను అడ్డుకోవడమే తాను చేసిన తప్పా అని మాణిక్యరావు ఆవేదన వ్యక్తం చేశారు.
మాచర్లలో వైఎస్సార్సీపీ అరాచకాలు - మహిళపై కత్తితో దాడి - Pinnelli follower attacked on woman