Notices to Sajjala Ramakrishna Reddy : వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి గుంటూరు జిల్లా మంగళగిరి గ్రామీణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో విచారణకు రావాలని అందులో వివరించారు. గురువారం ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరు కావాలని స్పష్టం చేశారు.
లుక్‌అవుట్ నోటీసులు జారీ :వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా 2021 అక్టోబర్ 19న ఆ పార్టీకి చెందిన మూకలు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి పాల్పడ్డాయి. దీనిపై కేసు నమోదు కావడంతో ఇప్పటికే పలువురు వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు విచారించారు. ఈ కేసులో సజ్జల ప్రమేయం ఉందని గుర్తించిన పోలీసులు ఆయన విదేశాలకు వెళ్లకుండా ఇప్పటికే లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు.