Man Spot Dead in Firecracker Explosion in Eluru : దీపావళి పండుగ పూట ఏపీలోని ఏలూరులో విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి బాణాసంచా తీసుకెళ్తుండా ప్రమాదవశాత్తు వాహనం గుంతలో పడటంతో బండి అదుపు తప్పింది. ఈ క్రమంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన నగరంలోని తూర్పు వీధిలో చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సుధాకర్ అనే వ్యక్తి బైక్‌పై ఉల్లిపాయ బాంబుల బస్తా తీసుకెళ్తున్నాడు. గంగానమ్మ ఆలయ సమీపంలోకి వచ్చేసరికి రోడ్డుపై గుంత కారణంగా బైక్‌పై నుంచి బస్తా కిందపడింది. దీంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సుధాకర్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడి శరీర భాగాలు ఛిద్రమయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ఘటనాస్థిలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆలయంలో పేలిన బాణసంచా - 150 మందికి పైగా గాయాలు, పలువురు పరిస్థితి విషమం
బాణా సంచా తయారీ కేంద్రంపై పిడుగు :ఏపీలో ఏకధాటిగా కురుస్తున్న వర్షం ఉరుములు, మెరుపులతో దద్దరిల్లుతోంది. అలాంటి వాతావరణంలో బుధవారం సాయంత్రం ఓ పిడుగు బాణాసంచా తయారీ కేంద్రం పడింది. చిన్న నిప్పు రవ్వకే భగ్గున మండే స్వభావముండే మందుగుండు సామగ్రి క్షణాల్లో బూడిదైంది. దీంతో అక్కడ పని చేస్తున్న ఇద్దరు మహిళలు సజీవదహనమైపోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. 9 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డ ఘటన తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలో చోటుచేసుకుంది.
తణుకు మండలం వెంకట్రాయపురానికి చెందిన వి.రామశివాజీ లైసెన్సు తీసుకుని సాయి ఫైర్ వర్క్స్ పేరిట తయారీ కేంద్రాన్ని నడుపుతున్నాడు. బుధవారం బాణాసంచా తయారీ పనులు చేస్తుండగా ఆ కేంద్రంపై పిడుగు పడి క్షణాల్లో బూడిదైంది. నిర్వాహకుడి భార్య వేగిరోతు శ్రీవల్లి, అందులో పని చేసే గుమ్మడి సునీత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అందులో పని చేస్తున్న మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన సాయంత్రం 5.15 గంటలకు జరగ్గా, క్షతగాత్రులను తరలించేందుకు తణుకు నుంచి 108 అంబులెన్సులు చేరుకునేందుకు గంటన్నర సమయం పట్టింది.
బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం - ఆ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు!
బాణాసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం - ముగ్గురికి గాయాలు, పదికి పైగా వాహనాలు దగ్ధం