Man Attack on Nizamabad Mayor Husband :తన భూమిని కబ్జా చేశాడని మేయర్ భర్తపై విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పట్టపగలు అందరూ చూస్తుండగానే చుట్టుపక్కల వారిని బెదిరిస్తూ దాడి చేసి అక్కడి నుంచి నిందితుడు ఉడాయించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిజామాబాద్ మేయర్ దండు నీతూ కిరణ్ భర్తపై రసూల్ అనే ఆటో డ్రైవర్ విచక్షణా రహితంగా దాడి చేశాడు.
నిజామాబాద్ మేయర్ భర్తపై ఆటో డ్రైవర్ దాడి - అదే కారణం! - ATTACK ON NIZAMABAD MAYOR HUSBAND
నిజామాబాద్ మేయర్ భర్తపై దాడి - సుత్తితో దాడి చేసిన ఆటో డ్రైవర్ - ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మేయర్ భర్త
Man Attack on Nizamabad Mayor Husband (ETV Bharat)
Published : Nov 19, 2024, 12:01 PM IST
మేయర్ భర్త చంద్ర శేఖర్ తన భూమిని కబ్జా చేశాడని ఆరోపిస్తూ అతని తలపై సుత్తితో దాడి చేశాడు. ఘటనలో చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి అతన్ని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఆసుపత్రికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దాడి చేసి పరారీలో ఉన్న నిందితుడి కోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు.